A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్:
నిర్మల్ జిల్లా మాడిగం వాసి గార్ల సురేష్ అనే యువకుడు దుబాయిలో ఒక కంపెనీలో పని చేయడానికి వెళ్ళాడు గత నెల 26 వ తేదీ నుండి తప్పిపోయాడు మతి స్థిమితం కోల్పోయి ఎక్కడెక్కడో తిరుగుతూ అబిదాబి కి చేరుకున్నాడు.
విషయం తెలిసిన వెంటనే కుటుంబ సభ్యులు ఆర్మూర్ కు వచ్చి “ప్రవాస భారతీయుల హక్కులు సంక్షేమ వేదిక“ అధ్యక్షుడు కోటపాటి నరసింహం నాయుడు ను కలిసి తమ భర్తను వెతికి రప్పించవలసిందిగా కోటపాటి ని వేడుకున్నారు. వెంటనే స్పందించిన కోటపాటి దుబాయ్ లోని ఇండియన్ కన్సోలేట్ అధికారులకు, సంబంధిత కంపెనీని అధికారులకు, దుబాయ్ లోని ప్రవాస భారతీయుల హక్కులు సంక్షేమ వేదిక కో ఆర్డినేటర్ జంగం బాలకిషన్ లకు సమాచారం ఇచ్చి గర్క సురేష్ ను వెతకడానికి ప్రయత్నించవలసిందిగా కోరడం జరిగింది. అక్కడి సోషల్ మీడియాలో మరియు ఇతర సామాజిక కార్యకర్తల సహాయం తో 3 రోజుల వ్యవదిలోనే సురేష్ ను గుర్తించి కంపెనీకి అప్పగించడం జరిగింది. అతను అక్కడే ఉండి పని చేస్తానని చెప్పినప్పటికీ మతి స్థిమితం లేక తప్పిపోయిన వ్యక్తి కనుక భవిష్యత్తులో మళ్లీ తప్పిపోతాడేమోనని కంపెనీ వారు సురేష్ ను ఇంటికి పంపడానికి నిర్ణయించి నిన్నటి రోజున అబుదాబి నుండి విమానం ఎక్కించి పంపించారు. హైదరాబాద్ చేరుకున్న సురేష్ ను మిత్రుడు శ్రీకాంత్ భార్య నీరజ లు రిసీవ్ చేసుకుని డైరెక్ట్ గా ఆర్మూర్ చేరుకొని కోటపాటి కార్యాలయానికి వచ్చి కోటపాటిని కలిసి తమ కుటుంబ సభ్యున్ని క్షేమంగా రప్పించినందుకు ధన్యవాదాలు తెలిపారు. కోటపాటి మాట్లాడుతూ ఇక్కడ కల్తీకల్లు సేవించే అలవాటు ఉన్నవారు ఇక్కడ ఉన్నప్పుడే మానుకొనిన అనంతరం ఇతర దేశాలకు వెళ్లవలసిందిగా సూచించారు. సురేష్ ను వెతికి పట్టుకోవడం కోసం తన పూర్తి సమయాన్ని కేటాయించి మూడు రోజులలో పలె గుర్తించిన జంగం బాల్ కిషన్ ను ఇతర సామాజిక కార్యకర్తలకు ఎంబసీ అధికారులకు కంపెనీ కి ధన్యవాదాలు తెలిపారు ఈ సందర్భంలో స్థానిక బిజెపి నాయకుడు ఎస్ రుక్మాజి కూడా పాల్గొన్నారు