A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్:
ఆర్మూర్ పట్టణంలోని ప్రజాపంథా మార్గదర్శకుడుదుర్గంపూడి వెంకటకృష్ణ (డీవీకే) స్మారక విగ్రహాన్ని ఆర్మూర్‌లోని పార్టీ కార్యాలయంలో కేంద్ర కమిటీ నాయకుడు కేజీ రాంచందర్ శనివారం ఆవిష్కరించారు. పట్టణంలోని అంబేడ్కర్ చౌరస్తా నుంచి పార్టీ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో రాష్ట్ర సెక్రటేరియట్ సభ్యుడు ప్రభాకర్, డివిజన్ కార్యదర్శి బి దేవారాం, ముత్తెన్న, రామకృష్ణ, సురేష్, తదితరులు పాల్గొన్నారు.