A9 న్యూస్ ప్రతినిధి:
ఐఎఫ్టియు జిల్లా ఉపాధ్యక్షులు బి.సూర్య శివాజీ
సమాజంలో మౌలిక మార్పు కోసం జీవితాలతో పాటు ప్రాణాలను అర్పించిన అమరవీరుల సంస్మరణ సభ 2024 నవంబర్ 8న ఆర్మూర్ లో ఉదయం 11 గంటలకు నిర్వహిస్తున్నామని ఐఎఫ్టియు నిజామాబాద్ జిల్లా ఉపాధ్యక్షులు బి.సూర్య శివాజీ తెలిపారు.
ఆర్మూర్ మండలంలోని అందాపూర్ గ్రామంలో సమావేశం నిర్వహించిన అనంతరం పాత్రికేయుల సమావేశాన్ని ఏర్పాటు చేసి ఆయన మాట్లాడుతూ దోపిడీ పీడనలేని సమాజం కోసం అగ్ర భాగాన నిలిచి అమరత్వం పొందిన నాయకుల జీవితాలు స్ఫూర్తిదాయకమని ఆయన అన్నారు.
పాలకులు మారిన కార్మికుల, ప్రజల జీవితాలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నచందంగా ఉన్నాయని ఆయన అన్నారు.
అన్నదాత రైతు, శ్రమజీవి కార్మికులు అనునిత్యం దోపిడీకి గురి చేయబడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రజా సమస్యలు పరిష్కరించాలని పాలకులు పాలకుల మధ్య ప్రాంతీయ, కుల, మతాల వైషామ్యాలు రెచ్చగొడుతున్నారని ఆయన అన్నారు. సమ సమాజం కోసం అమరవీరుల ఆశయ సాధన కోసం ముందుకు సాగుదామని, కార్మికుల ఉపాధి రక్షణ కోసం అమర వీరుల స్ఫూర్తితో ఆందోళన చేద్దామని ఆయన పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో ఐఎఫ్టియు పద్మ, లక్ష్మి, రాజు, గోదావరి, నాగమణి, పోసాని, లింగవ్వ, తదితరులు పాల్గొన్నారు.