A9 న్యూస్ ప్రతినిధి:
ఐఎఫ్టియు ఆల్ ఇండియా ప్రధాన కార్యదర్శి టి.శ్రీనివాస్
అమరవీరుల అమరత్వ స్ఫూర్తితో కార్మిక ,ప్రజా సమస్యల పరిష్కారం కోసం మొక్కవోని ధైర్యంతో ముందుకు సాగుదామని ఐఎఫ్టియు ఆల్ ఇండియా *ప్రధాన కార్యదర్శి పి శ్రీనివాస్* పిలుపునిచ్చారు.
సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ ఆర్మూర్ డివిజన్ కమిటీ కార్యదర్శి దాసు అధ్యక్షతన ఆర్మూర్ పట్టణంలోని ఉర్దూ షాది ఖానా ఫంక్షన్ హాల్లో అమరవీరుల స్మారక సభ నిర్వహించారు.
టి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొని, భూమి,భుక్తి భారత విముక్తి కోసం పోరాడి అసలు బాసిన అమరవీరుల జీవితాలు మనకు స్ఫూర్తిదాయకమని ఆయన అన్నారు. దేశానికి స్వాతంత్రం ప్రకటించి 77 ఏళ్లు గడుస్తున్న ఆకలి, పేదరికం, నిరుద్యోగం, అసమానతలు, కుల, మత వైషామ్యాలు పెరుగుతూనే ఉన్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పాలకవర్గ పార్టీలు అధికారం కోసం తప్పుడు పద్ధతులను అవలంబించి ప్రజల్ని సమస్యల సుడిగుండంలో నెట్టివేసె కుట్ర చేస్తున్నాయని ఆయన అన్నారు. 10 సంవత్సరాల నరేంద్ర మోడీ పరిపాలనలో కార్మికులు పోరాడి సాధించుకున్న హక్కులు హరించివేయబడ్డాయని ఆయన అన్నారు. మోడీ కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్లుతో మరణ శాసనం విధించారని ఆయన తెలిపారు. ఎన్నికల్లో ఉపాధి భద్రత, ప్రతి ఏటా రెండు కోట్ల కొలువులు, ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణ, హామీలు అటుకెక్కినాయని ఆయన అన్నారు. ప్రజల సంపదను కార్పొరేట్ అధిపతులు అంబానీ ,ఆదానీలకు కట్టబెట్టి పేదలకు కష్టాలు కన్నీళ్లు నరేంద్ర మోడీ ప్రభుత్వం మిగిల్చిందనీ ఆయన అన్నారు. ఇప్పటికీ నిరక్షరాస్యత, పేదరికం, ఆకలి చావులు, నిలువ నీడ లేక అవస్థలు పడుతున్న జనం కోట్లల్లో ఉన్నారని ఆయన తెలిపారు. మోడీ ప్రభుత్వం సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ కార్మికులకు సమాన పనికి సమాన వేతనం అమలు చేయించాలని ఆయన డిమాండ్ చేశారు. మోడీ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమించాలని శ్రీనివాస్ పిలుపునిచ్చారు. సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ
నిజామాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆకుల పాపయ్య మాట్లాడుతూ పుట్టుక చావు సహజమని, జనం కోసం మరణించడం ఉన్నతమని, అమరవీరుల స్ఫూర్తితో మెరుగైన సమాజం కోసం పోరాడదాం అని ఆయన అన్నారు. రైతు లేనిదే రాజ్యం లేదంటూ ప్రగల్బాలు పలికిన పాలకులు రైతు వ్యతిరేక 3 నల్ల చట్టాలు తెచ్చి వ్యవసాయ రంగాన్ని బలిపీఠంపై మోడీ ప్రభుత్వం ఎక్కించిందని ఆయన విమర్శించారు. రాష్ట్రంలో మిగులు, భూములను పేదలకు పెంచాలని, పేదల ఇళ్ల స్థలాలు ఇచ్చి, డబుల్ బెడ్ రూములు నిర్మించి ఇవ్వాలని, ఆయన కోరారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయాలని, రైతులందరికీ పూర్తిగా రుణమాఫీ, రైతుబంధు జమ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో ఉద్యోగాలు భర్తీ చేసి, నిరుద్యోగ సమస్యను పరిష్కరించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఆయన డిమాండ్ చేశారు. మత వైషామ్యాలు రెచ్చగొట్టే వారి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండి సమస్యల పోరాటానికి సమర శంఖం పూరించాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ సభలో ఐఎఫ్టియు జిల్లా ఉపాధ్యక్షులు సూర్య శివాజీ, ఎల్ఐసి బాలయ్య, అరుణోదయ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు సురేష్ బాబు, అబ్దుల్, పిడిఎస్యు ఆర్మూర్ డివిజన్ అధ్యక్షులు ప్రిన్స్, ఏఐకేఎంఎస్ నాయకులు సాయి రెడ్డి, మార్క్స్, దేవన్న, పి ఓ డబ్ల్యు నాయకులు చిట్టిక్క, పద్మ, పి వై ఎల్ జిల్లా మాజీ అధ్యక్షులు రవి, ఎస్ వెంకటేష్, సంజీవ్, ఐఎఫ్టియు నాయకులు సొప్పరి గంగాధర్, భానుచందర్, నరాటి లక్ష్మణ్, పిడిఎస్యు నాయకులు కైఫ్, రాహుల్, అరుణోదయ కళాకారులు రంజిత్, పోశెట్టి, భారతి, అరుణ, తదితరులు పాల్గొన్నారు. ఈ స్మారక సభ సందర్భంగా ఆర్మూర్ పట్టణంలో ప్రదర్శన నిర్వహించారు. ఈ సభలో అరుణోదయ కళాకారులు తమఆటపాటతో ఉత్తేజపరిచారు.