Monday, November 25, 2024

అంగన్ వాడీలకు శుభవార్త చెప్పిన మంత్రి సీతక్క

spot_img
- Advertisement -spot_imgspot_img
- Advertisement -spot_imgspot_img

 

 

పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క అంగన్ వాడీలకు శుభవార్త చెప్పారు. అంగన్ వాడీ టీచర్లు, హెల్పర్లకు బహుమతులు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న 35,700 అంగన్ వాడీ కేంద్రాల్లోపని చేస్తున్న టీచర్లు, హెల్పర్లకు ఒక్కొక్కరికి రెండు చీరల చొప్పున పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు.

 

ఈ మేరకు సోమవారం రాష్ట్ర సచివాలయంలో అధికారులతో సీతక్క సమీక్ష నిర్వహించారు. క్వాలిటీ చీరలు ఇచ్చేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. అంగన్ వాడీ సిబ్బందికి ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు.

 

అమ్మలాగా చిన్నారుల భవిష్యత్‌ను తీర్చిదిద్దుతున్న అంగన్ వాడీ టీచర్లు, హెల్పర్లను కొనియాడారు. ఆర్థిక సమస్యలతో కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయని మంత్రి వివరించారు. అయినప్పటికీ అంగన్ వాడీ సమస్యలన్నిటికీ పరిష్కారం చూపిస్తామని పేర్కొన్నారు. రిటర్మెంట్ బెనిఫిట్స్ సాంకేతిక సమస్యలతో ఆలస్యం అయ్యాయని ఎవరు బాధ పడాల్సి అవసరం లేదన్నారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ పై పది రోజుల్లో జీవో వస్తుందని ప్రకటించారు. అద్దె భవనాల్లో కొనసాగుతున్న అంగన్ వాడీ కేంద్రాలకు సొంత బిల్డింగ్ లు నిర్మిస్తామని తెలిపారు.

 

అంగన్ వాడీలకు ఉచిత విద్యుత్‌ను ఇస్తామన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పిస్తామని చెప్పారు. తెలంగాణలో విద్యావ్యవస్థను బలోపేతం చేస్తామని వివరించారు. 16 ఏళ్ల తర్వాత పాఠశాల, వసతి గృహాల్లో ఉండే విద్యార్థులకు కాస్మొటిక్ ఛార్జీలు, ఏడేళ్ల తర్వాత డైట్ ఛార్జీలను 40% పెంచినట్లు మంత్రి గుర్తు చేశారు.అంతర్జాతీయ స్థాయిలో విద్యార్థులందరికీ విద్యను అందించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ రూపొందిస్తుందని పేర్కొన్నారు. విద్యావేత్తలు ఉంటే కుటుంబం, గ్రామం, సమాజం అభివృద్ధి బాటలో పయనిస్తుందని చెప్పారు.

 

వసతి గృహాల్లో ఉండే విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను చేరుకుని, ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారని గుర్తు చేస్తున్నారు. గిరిజన విద్యార్థులను అన్ని రకాలుగా ప్రోత్సహిస్తామన్నారు. తాను ఏ శాఖలో ఉన్నా తన మనసు గిరిజన సంక్షేమం పరితపిస్తుందని పేర్కొన్నారు. తన ప్రాణం ఆదివాసీ, గిరిజనులు, చెంచుల గురించి కొట్టుకుంటుందని వివరించారు. ఉన్నత విద్యాసంస్థల్లో సీట్లు సంపాదించిన పలువురు విద్యార్థులకు మంత్రి సీతక్క ల్యాప్ టాప్‌లు అందజేశారు.

+ posts
- Advertisement -spot_imgspot_img
Latest news
spot_img
- Advertisement -spot_img
Related news
- Advertisement -spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here