నిర్మల్ జిల్లా దిలావర్ పూర్ మండలం మోడెగాం వాసి సురేష్ అనే యువకుడు కంపెనీ వీసాపై దుబాయిలో కార్పెంటర్ ఉద్యోగానికై ఉపాధి లభిందనె సంతోషంతో గత నెల 20వ తేదీన వెళ్లి కంపెనీలో రిపోర్టు చేసిన అనంతరం రెండు రోజులకు అతను ఉంటున్న నివాసం నుండి మాయమైపోయాడు సమాచారం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఈరోజు ఆర్మూర్ కు వచ్చి “ప్రవాస భారతీయుల హక్కులు సంక్షేమ వేదిక” అధ్యక్షుడు కోటపాటి నరసింహం నాయుడును కలిసి తమ భర్తను వెతికి ఇండియాకు రప్పించాల్సిందిగా వేడుకున్నారు. కోటపాటి వెంటనే స్పందించి, దుబాయ్ లోని ఇండియన్ ఎంబసికి, MRWF కో ఆర్ డినేటర్ జంగం బాల్ కిషన్ లకు సమాచారం పంపించారు. ఎంబసి, లోకల్ పోలీసులు మరియు MRWF కార్యకర్తల ద్వారా వెదికిస్తున్నారు. ఇండియాకు రప్పించే చర్యలు చేపట్టారు. ముఖ్యంగా ఇటీవల గల్ఫ్ దేశాలకు వలసబోయే తెలంగాణవాసులు వెళ్లిన రెండు మూడు రోజులకే తప్పిపోతున్న సంఘటనలు చాలా జరుగుతున్నాయి. ఇక్కడ ఉన్నప్పుడు”కల్లు” డిపోలలో లేదా దుకాణాలలో, కల్లు తాగే వ్యక్తులే ఈ విధంగా మతితప్పి పోతున్నారు. కాబట్టి ప్రభుత్వం పడిన చర్యలు చేపట్టి ఏజెంట్లను నియంత్రించి, కల్తీ కల్లు ను తాగే వ్యక్తులను ఇతర దేశాలకు పంపకుండా చర్యలు తీసుకోవాలని కోటపాటి డిమాండ్ చేశారు. కోటపాటిని కలిసిన వారిలో సురేష్ భార్య నీరజ, మిత్రుడు నరేందర్, సురేష్ తల్లి, కొడుకు తదితరులు ఉన్నారు.