A9NEWS
ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పి.డి.ఎస్.యూ) ఆర్మూర్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు ఆర్మూర్ పట్టణ కేంద్రంలోని పీ డి ఎస్ యూ విప్లవ విద్యార్థి అమరవీరుల సంస్మరణ సభ సందర్బంగా ఉదయం 6 గంటలకు సుభాష్ చంద్రబోస్ విగ్రహం పెర్కిట్ చౌరస్తా నుండి భగత్ సింగ్ విగ్రహం మామిడిపల్లి చౌరస్తా వరకు మార్నింగ్ వాక్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి *పి.డి.ఎస్.యూ ఆర్మూర్ డివిజన్ అధ్యక్షులు ప్రిన్స్* అధ్యక్షతగా వ్యవహరించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా *పి.డి.ఎస్.యూ పూర్వ నాయకులు ఎన్ దాసు* హాజరయ్యారు. వారు మాట్లాడుతూ పి.డి.ఎస్.యూ గత 50 ఏండ్ల కాలంలో విద్య రంగ సమస్యలపైన, శాస్త్రీయ విద్యా సాధనకై, సమ సమాజ స్థాపనకై, నూతన ప్రజాస్వామిక విప్లవం కోసం, విద్య ప్రైవేటీకరణ కార్పొరేటికరణ కు వ్యతిరేకంగా పి.డి.ఎస్.యూ విద్యార్థి సంఘం పోరాడుతూ వస్తుందని , విద్యార్థి ఉద్యమంలో జార్జ్ రెడ్డి, జంపాల చంద్రశేఖర్ ప్రసాద్, రంగవల్లి, శ్రీపాద శ్రీహరి, కోలా శంకర్ మరియు ఎందరో విద్యార్థి రత్నాలు బిగిపిడికిలి జెండా కోసం తమ ప్రాణాలను తృణ ప్రాయంగా అర్పించరని అన్నారు. వారి పోరాట వారసత్వాన్ని కొనసాగించాలని, ఆయన అన్నారు. విద్యార్థి అమరవీరుల అమరత్వం స్ఫూర్తితో బలమైన విప్లవ విద్యార్థి ఉద్యమాలను నిర్మించాలని వారు విద్యార్థులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంని ఉద్దేశించి *ఆర్మూర్ డివిజన్ ఆధ్యక్షులు ప్రిన్స్* మాట్లాడుతూ పీ.డి.ఎస్.యూ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఈరోజు విప్లవ విద్యార్థి అమరవీరుల సంస్మరణ సభ కార్యక్రమాన్ని నిర్వహించారు అని అయన అన్నారు. పిడిఎస్యూ విద్యార్థుల ఉద్యమాల దిక్సూచి అని, ఈ దేశంలో పేదలు అట్టడుగు వర్గాలకు చెందిన విద్యార్థులందరికీ సమానమైన, శాస్త్రీయమైన విద్యను అందించాలని, అసమానతలు లేని సమాజం నిర్మించాలని, విద్యార్థుల పక్షాన నిరంతరం పోరాడిందనీ ఆయన అన్నారు.1975 నవంబర్ 5న పిడిఎస్యు నిర్మాత అయిన జెసీఎస్ ప్రసాద్ ను అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎమర్జెన్సీ లో ఎన్కౌంటర్ చేసిందని వారు అన్నారు. నేటితో జేసీస్ ప్రసాద్ అమరాత్వం చెంది 50ఏండ్లు అవుతున్న సందర్బంగా వారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు అలాగే భగతసింగ్ విగ్రహనికి కూడా పూలమాల వేసి నివాళులు అర్పించారు.పిడిఎస్యు వారసులుగా వారి అమరాత్వని స్పూర్తితో బలమైన విప్లవ విద్యార్థి ఉద్యమాలను చేస్తామని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ (ఎం ఎల్) న్యూ డెమోక్రసీ ఆర్మూర్ సబ్ డివిజన్ కార్యదర్శి సూర్య శివాజీ, పీ.డి.ఎస్.యూ నాయకులు, సాయి, రహమాన్, కళ్యాణ్, నితిన్, నిఖిల్, గణేష్,నిశాంత్, రాహుల్, సంపత్ తదితరులు పాల్గొన్నార