భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా ప్రాథమిక సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహిస్తాఉంది దీంట్లో భాగంగానే క్రియాశీల సభ్యత్వాన్ని సైతం నిర్వహించాలని భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వం ఆదేశానుసారం ఈరోజు ఆర్మూర్ పట్టణంలో క్రియాశీల సభ్యత్వాన్ని బిజెపి ఆర్మూర్ పట్టణ అధ్యక్షులు ద్యాగ ఉదయ్ ఆధ్వర్యంలో జిల్లా అధికార ప్రతినిధులు జెస్సు అనిల్ కుమార్, కలిగోట గంగాధర్లు ప్రారంభించడమైనది.
ఈ యొక్క కార్యక్రమంలో బిజెపి ఆర్మూర్ పట్టణ ప్రధాన కార్యదర్శి పోల్కం వేణు పాల్గొనడమైనది.
ఈ సందర్భంగా బిజెపి జిల్లా అధికార ప్రతినిది జెస్సు అనిల్ కుమార్, బిజెపి ఆర్మూర్ పట్టణ అధ్యక్షులు ద్యాగ ఉదయ్ మాట్లాడుతూ….ఏ కార్యకర్త లైతే ప్రాథమిక సభ్యత్వం 100 చేస్తారో వారు మాత్రమే క్రియాశీల సభ్యత్వానికి అర్హులని. ఇలాంటి అవకాశం గతంలో ఎప్పుడూ లేదని ఇప్పుడు ఈ అవకాశాన్ని ప్రతి కార్యకర్త ఉపయోగించుకొని 100 వరకు ప్రాథమిక సభ్యత్వం చేసి క్రియాశీల సభ్యుడు అయితేనే రాబోయే మున్సిపాలిటీ, మండల మరియు గ్రామ పంచాయతీ ఎన్నికలలో మరియు భారతీయ జనతా పార్టీ కార్యవర్గంలో సైతం పట్టణ, మండల, పార్లమెంట్, అసెంబ్లీ, జిల్లా, రాష్ట్ర మరియు జాతీయస్థాయిలో సైతం బాధ్యతలను కావాలనుకున్నవారు కచ్చితంగా ప్రాథమిక సభ్యత్వం 100 మరియు క్రియాశీల సభ్యత్వం చేయవలసిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేయడమైనది.