Tuesday, November 26, 2024

ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్” ఫొటో ఎగ్జిబిషన్‌ను ప్రారంభించిన ఆర్మూర్ ఎమ్మెల్యే పైడీ రాకేష్ రెడ్డి:

spot_img
- Advertisement -spot_imgspot_img
- Advertisement -spot_imgspot_img

 

*విజేతలకు బహుమతులు ప్రధానం….అలరించిన ఒగ్గుకథ*

 

*జాతీయ సమైక్యతా స్ఫూర్తిని ప్రోత్సహించడం “ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్” లక్ష్యం : ఆర్మూర్ ఎమ్మెల్యే పైడీ రాకేష్ రెడ్డి :-*

 

 

 

ఆర్మూర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో జాతీయ ఐక్యత దినోత్సవం సందర్భంగా “ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్” (ఈ బి ఎస్ బి) పై ఛాయా చిత్ర ప్రదర్శనను ఆర్మూర్ ఎమ్మెల్యే పైడీ రాకేష్ రెడ్డి సోమవారం రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.

కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్, ఫీల్డ్ ఆఫీస్ నిజామాబాద్ ఈ ప్రదర్శనను ఏర్పాటు చేసింది.

ఈబీఎస్‌బీ కింద జత చేసిన హర్యానా, తెలంగాణ రాష్ట్రాలలోని వివిధ ఆసక్తికరమైన అంశాలు, కళా రూపాలు, వంటకాలు, పండుగలు, స్మారక చిహ్నాలు, పర్యాటక ప్రదేశాలు, క్రీడలు మొదలైన వాటిని తెలియజేసేలా ఈ ప్రదర్శనను ఏర్పాటు చేశారు. ఈ ఎగ్జిబిషన్ 2024 అక్టోబర్ 28 నుంచి 29 వరకు ఆర్మూర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో వీక్షించేందుకు తెరిచి ఉంటుంది.

ఈ సందర్భంగా ఆర్మూర్ ఎమ్మెల్యే పైడీ రాకేష్ రెడ్డి మాట్లాడుతూ,కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ ఆధ్వర్యంలో జాతీయ ఐక్యత దినోత్సవం సందర్భంగా ఏక్‌భార‌త్ – శ్రేష్ఠ‌భార‌త్ పై ఛాయా చిత్ర ప్రదర్శనను ఆర్ముర్ డిగ్రీ కాలేజ్ లో నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది. ఈ ఫోటో ఎగ్జిబిషన్ ఈ నెల 28వ తేదీ నుండి 29వ తేదీ వరకు రెండు రోజులు పాటు కొనసాగుతోందన్నారు. దేశ స‌మైఖ్య‌త‌, స‌మ‌గ్ర‌త‌ను పెంపొందించేందుకు కేంద్ర ప్ర‌భుత్వం ఏక్ భారత్ – శ్రేష్ఠ భారత్ నిర్వహిస్తుందన్నారు. విద్యార్థులు, యువతల్లో దేశ‌భ‌క్తి, స్వాతంత్ర ఉద్య‌మం త‌దిత‌ర అంశాల‌పై అవగాహన కల్పిస్తుందన్నారు. ఆయా రాష్ట్రాల కళ, సంస్కృతి, ఆహార‌పు అల‌వాట్లు ప‌ట్ల అవగాహ‌న క‌ల్పించ‌డంతోపాటు వివిధ ప్రాంతాల ప్ర‌జ‌ల మ‌ధ్య స‌హృధ్భావ వాతావర‌ణం నెల‌కొల్ప‌డం ఈ కార్య‌క్ర‌మం ల‌క్ష్య‌ము అన్నారు. వివిధ రాష్ట్రాలు, విభిన్న ప్రాంతాలు, సంస్థానాల‌ను విలీనం చేసి ఏక భార‌త్ సాధ్యం చేసిన స‌ర్దార్ వ‌ల్ల‌భాయ్ ప‌టేల్ జ‌యంతి సంద‌ర్భంగా 2015 అక్టోబ‌రు 31న‌ గౌరవ ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోదీ ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ (ఈబీఎస్‌బీ)ని ప్రారంభించారు అన్నారు.

ఈ జంట రాష్ట్రాల సుసంపన్న సాంస్కృతిక వారసత్వానికి ప్రాచుర్యం కల్పించడంలో, ప్రజలకు ప్రజలకు మధ్య సంబంధాలు పెంపొందించడంలో ఇలాంటి కార్యక్రమాలు ఎంతగానో దోహద పడతాయన్నారు. రెండు రాష్ట్రాల ప్రజలను కలిపి మన సంపన్న, విభిన్న సాంస్కృతిక వారసత్వం గురించి అవగాహన కల్పించగల ఈ చొరవ తీసుకున్నందుకు కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ ను ఆయన అభినందించారు.

బహుమతులు ప్రదానం

ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్” పై నిర్వహించిన వ్యాసరచన, రంగోలి పోటీల్లో మొదటి, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచిన విద్యార్థులకు ముఖ్య అతిథిలు చేతులు మీదుగా బహుమతులు ప్రధానం చేశారు. అంతకు ముందు సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ ఆధ్వర్యంలో కళాకారులు ఒగ్గుకథ నృత్య ప్రదర్శన చేశారు.

ఈ కార్యక్రమంలో సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ ఫీల్డ్ పబ్లిసిటీ ఆఫీసర్ బి.ధర్మ నాయక్, తెలంగాణ విశ్వవిద్యాలయం యన్ ఎస్ ఎస్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ ప్రొఫెసర్ రవీంద్రారెడ్డి, ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వై వేణు ప్రసాద్, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ సునీత,

జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ విజయనాధ రెడ్డి, తెలంగాణ మైనారిటీ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ నహీదా ఫిర్దౌస్, ప్రభుత్వ డిగ్రీ కళాశాల అకడమిక్ డాక్టర్ ఎన్.అంబర్ సింగ్, సీబీసీ ఏపీఏ రషిద్, కళాశాల అధ్యాపకులు, విద్యార్థిని, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

+ posts
- Advertisement -spot_imgspot_img
Latest news
spot_img
- Advertisement -spot_img
Related news
- Advertisement -spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here