Tuesday, November 26, 2024

ఒకే రాష్ట్రం ఒకే పోలీసు విధానం’ అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ ప్రత్యేక పోలీస్‌ కానిస్టేబుళ్లు :

spot_img
- Advertisement -spot_imgspot_img
- Advertisement -spot_imgspot_img

మామునూరు, సిరిసిల్ల మంచిర్యాల , ఆదిలాబాద్‌ : ‘ఒకే రాష్ట్రం ఒకే పోలీసు విధానం’ అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ ప్రత్యేక పోలీస్‌ కానిస్టేబుళ్లు వరంగల్, ఆదిలాబాద్, మంచిర్యాల జిల్లాల్ల శనివారం నిరసన తెలిపారు. మరోవైపు బెటాలియన్‌ కమాండెంట్‌ అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ సిరిసిల్లలో ఆందోళనకు దిగారు. సెలవుల విషయంలో ప్రభుత్వం సానుకూలంగా స్పందించిన నేపథ్యంలో ఆ ఒక్క సమస్యే ఎజెండా కాదని ఏఆర్, సివిల్‌ పోలీస్‌ విధానం రద్దు చేసి ‘ఒకే రాష్ట్రం.. ఒకే పోలీసు విధానం’ అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ వరంగల్‌ జిల్లా మామునూరు టీజీఎస్పీ 4వ బెటాలియన్‌లో కానిస్టేబుళ్లు యూనిఫాంలోనే నిరసన తెలిపారు. వరంగల్‌ పోలీసు కమిషనర్‌ అంబర్‌ కిషోర్‌ ఝా బెటాలియన్‌కు చేరుకొని సిబ్బందితో చర్చలు జరపడంతో ఆందోళన విరమించి విధుల్లోకి వెళ్లారు. మరోవైపు బెటాలియన్‌ కమాండెంట్‌ శ్రీనివాస్‌రావు అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రం పరిధి సర్దాపూర్‌లోని 17వ బెటాలియన్‌ పోలీసులు ఆందోళనకు దిగారు. తమ భార్యలపై అనుచిత వ్యాఖ్యలు ఎందుకు చేశారంటూ కమాండెంట్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న ఎస్పీ అఖిల్‌ మహాజన్‌ అక్కడికి చేరుకొని ఆందోళన చేస్తున్న పోలీసులతో మాట్లాడారు. ఇష్టం వచ్చినట్లు డ్యూటీలు వేసి కుటుంబాన్ని దూరం చేస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తాము పోలీసులమా.. పనివాళ్లమా తెలియడం లేదని, వాగులో ఇసుక, మిషన్‌ భగీరథ పైపులు తీసుకురావాలని కమాండెంట్‌ ఆదేశాలు జారీ చేస్తున్నారని వాపోయారు. తమకు కుటుంబాలను దూరం చేయవద్దని, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో ఉన్న పోలీస్‌ విధానాన్ని తెలంగాణలో అమలు చేసి న్యాయం చేయాలని ఓ కానిస్టేబుల్‌ ఎస్పీ కాళ్లపై పడి వేడుకున్నారు. ఆదిలాబాద్‌ జిల్లా యాపల్‌గూడ రెండో బెటాలియన్‌ పోలీసులు కుమురంభీం చౌరస్తా వద్ద కుటుంబ సభ్యులతో కలిసి ఆందోళన చేపట్టారు. మంచిర్యాల జిల్లా గుడిపేటలోని టీజీఎస్పీ 13వ పటాలం పోలీసులు, వారి కుటుంబసభ్యులు జిల్లా కేంద్రంలోని రైల్వేవంతెనపై రాస్తారోకో నిర్వహించారు. చిన్నపిల్లలతో తరలివచ్చిన పోలీసు కుటుంబాలు రోడ్డుపై బైఠాయించడంతో వాహనాలు భారీగా నిలిచిపోయాయి. ఏసీపీ ప్రకాశ్‌ ఆందోళనకారులతో మాట్లాడడంతో ఆందోళన విరమించారు.

 

*పోలీసు కుటుంబాలు రోడ్డెక్కడం మొదటిసారి*

 

: మాజీ మంత్రి సబిత

పోలీసు కుటుంబాలు రోడ్డెక్కడం చరిత్రలో మొదటిసారని మాజీ మంత్రి సబితారెడ్డి అన్నారు. హోంశాఖ నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వల్లే ఈ పరిస్థితి దాపురించిందని విమర్శించారు. తెలంగాణ భవన్‌లో శనివారం ఆమె విలేకర్లతో మాట్లాడారు. రాష్ట్రంలో హోంమంత్రి లేకపోవడం వల్ల కానిస్టేబుళ్లు తమ కష్టాలు ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితి నెలకొందన్నారు. ఏక్‌ పోలీస్‌.. వ్యవస్థపై ముఖ్యమంత్రి మాటను నిలబెట్టుకోవాలని కోరారు. ఎమ్మెల్సీ వాణీదేవి మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రజాపాలన ఉందా అనే అనుమానం కలుగుతుందన్నారు.

+ posts
- Advertisement -spot_imgspot_img
Latest news
spot_img
- Advertisement -spot_img
Related news
- Advertisement -spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here