–శిశు మందిరాలు మంచి సంస్కార కేంద్రాలు
— సంస్కార కేంద్రాల ద్వారా విద్యార్థులకు శిక్షణ
— శ్రీ సరస్వతీ విద్యా మందిర్ ఆధ్వర్యం లో పేద విద్యార్థులకు సంస్కార కేంద్రాల ద్వారా వివిధ అంశాల భోధన
A9 న్యూస్, ఆర్మూర్
ఆర్మూరు పట్టణం లోని టీచర్స్ కాలనీ లో గల శ్రీ సరస్వతీ విద్యా మందిర్ ఆధ్వర్యం లో గోల్ బంగ్లా లోని పెద్ద బజారు ఏరియా లో పేద విద్యార్థులకు ,వెనకబడిన వర్గాల పిల్లలకు మంచి నడవడిక ,పద్ధతులు ,మన సంప్రదాయాలు,సంస్కృతి తెలియజెప్పే ఉద్దేశ్యం తో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి శిశు మందిరాలు బస్తీ ఏరియాలను తీసుకొని ఆ పరిసర ప్రాంతం లో వెనుకబడిన వర్గాల పిల్లలు ఉంటే వారందరినీ ఒక చోట చేర్చి సంస్కార కేంద్రాల నిర్వహణ చేయడం జరుగుతుంది.
ఈ కేంద్రాల ద్వారా పిల్లల యొక్క
మానసిక బుద్ధి ,శారీరక దృఢత్వం మెరుగుపడుతుంది. ఈ కేంద్రాలలో విద్యతో పాటుగా ఆటలు,పాటలు,శ్లోకాలు,పద్యాలు,గేయాలు తదితర అంశాలు బోధించడం ద్వారా పిల్లల శేయస్సుకు చాలా ఉపయోగ కరిణిగా ఉంటుంది.అందులో భాగంగా ఆర్మూరు పట్టణం లోని శ్రీ సరస్వతీ విద్యా మందిర్ పాఠశాలలో ఆదివారం రోజున సేవా వర్గ నిర్వహించడం జరిగినది. ఈ యొక్క సేవా వర్గ కు ఇందూరు విభాగ్ లోని పాఠశాలల నుండి సేవ ప్రాముఖ్ లు సేవ కేంద్ర నిర్వాహకులు పాల్గొనడం జరిగినది.ప్రాంత సేవా ప్రాముఖ్ గంగాధర రెడ్డి ఆధ్వర్యం లో సేవా వర్గ నిర్వహించడం జరిగినది. సంస్కార కేంద్రం లో నిర్వహించు విధానం పిల్లలకు ఎలాంటి పద్ధతుల్లో భోధన చేయించడం మరియు ఆట పాటలు,గీత్ లు,యోగ ఇలా పలు అంశాలు తెలియజేయడం జరిగినది.ఈ కార్యక్రమం లో జిల్లా కార్య దర్శి రవి నాథ్ ,ప్రాంత సేవ ప్రాముఖ్ గంగాధర రెడ్డి,పాఠశాల ప్రభంధ కారిణి కమిటీ అధ్యక్షులు వంశిక్రిష్ణ,కోశాధికారి రాజేష్,పాఠశాల ప్రిన్సిపల్ వినోద్ కుమార్,మేనేజ్మెంట్ అభిమాన్యులు,పాఠశాల మతాజీ లు శైలజ ముద్ర కోల,మంజుల,లత,సింధు,అంజలి,శైలజ ,శ్వేత మరియు వివిధ పాఠశాలల సేవా ప్రాముఖ్ లు ,మాతాజీ లు పాల్గొన్నారు.