A9 న్యూస్ కరీంనగర్:
కరీంనగర్ జిల్లా హుజురాబాద్ ఏరియా ఆసుపత్రిలో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. ఆసుపత్రి ఎమర్జెన్సీ విభాగం పక్కన ఉండే మహిళల మరుగుదొడ్ల వద్ద అప్పుడే అబార్షన్ చేసిన మృత ఆడ శిశువును గుర్తుతెలియని మహిళ వదిలేసి వెళ్ళింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. మృత శిశువును స్థానికులు గుర్తించి.. డ్యూటీలో ఉన్న డాక్టర్ రమేష్ కు సమాచారం ఇచ్చారు. ఆయన శిశువును పరిశీలించి పోలీసులకు, వైద్యాధికారులకు సమాచారం ఇచ్చారు.