అయ్యప్ప ఆలయం వద్ద సిమెంట్ రోడ్ నిర్మాణానికి భూమి పూజ చేసిన ఆలయ కమిటీ
సదాశివ్ A9 న్యూస్ ప్రతినిధి బాల్కొండ నియోజకవర్గం :సెప్టెంబర్ 16
నిజామాబాద్ జిల్లా భీమ్ గల్ పట్టణం లో చొక్కయ్య గుట్ట వద్ద గల అయ్యప్ప ఆలయం వద్ద కొండ పైకి సిమెంట్ రోడ్ నిర్మాణానికి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు.
ముందుగా అయ్యప్ప స్వామి ఆలయం లో ప్రత్యేక పూజలు జరిపినా అనంతరం సిమెంట్ రోడ్డు నిర్మాణానికి భూమిపూజా జరిపారు. ఇట్టి కార్యక్రమం లో ఆలయ కమిటీ చైర్మన్ కన్నె సురేందర్ , సభ్యులు రాంగిరి రమేష్, కొండల్ శ్రీనివాస్, రమేష్, సదాశివ్,శోభన్ రెడ్డి, రాజునాయక్, చేవ్వా అశోక్, సతీష్ గౌడ్, మూత లింబాద్రి, తోట ఈశ్వర్, విగ్నేష్, శ్రీనివాస్ , ఆలయ వ్యవహారాల సలహాదారులు పర్సరత్నం, పోల్కం సుదర్శన్,లు పాల్గొన్నారు
విశిష్ట అతీతులు డాక్టర్ బసంత్ రెడ్డి, డాక్టర్ సాయియాదవ్,వ్యాపారస్తులు, పలువురు నాయకులు, అయ్యప్ప భక్తులు పాల్గొన్నారు