గంగమ్మ ఒడిలోకి చేరుకున్న గౌరీ పుత్రుడు
సదాశివ్ A9 న్యూస్ ప్రతినిధి బాల్కొండ నియోజకవర్గం
నిజామాబాద్ జిల్లా భీమ్ గల్ మండలంలోని బాబాపూర్ గ్రామం ముదిరాజ్ వాడ ట్రాన్స్ఫార్మర్ వీధిలో ప్రతిష్టించిన వినాయకుని తొమ్మిది రోజులపాటు ఘనంగా భక్తిశ్రద్ధలతో పూజించి ఈరోజు ప్రధాన వీధుల గుండా శోభాయాత్ర నిర్వహించి అనంతరం పోచమ్మ కుంట చెరువు లో నిమజ్జనం చేశారు, ఈ శోభయాత్ర లో భాగంగా యువకులు, సాంప్రదాయ వస్త్రాలు ధరించారు, మహిళలందరూ ఏకరూప చీరలు ధరించి కోలాటం, నృత్యాలు చేయడం అందరినీ విశేషంగా అలరించాయి…..