ఏసీబీ వలలో నిజామాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి.. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టు,…..

On: Tuesday, June 23, 2026 3:26 PM

 

నిజామాబాద్, జూన్ 23: తెలంగాణలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) దాడులు కొనసాగుతున్న నేపథ్యంలో నిజామాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టయ్యారు. మంగళవారం తెల్లవారుజామున ఏసీబీ అధికారులు ఆయన నివాసంతో పాటు బంధువులకు చెందిన పలు ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు.

నమ్మదగిన సమాచారంతో ఏసీబీ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చేపట్టిన ఈ తనిఖీలు మొత్తం 10 ప్రాంతాల్లో కొనసాగాయి. సోదాల సందర్భంగా ఆదాయానికి మించిన ఆస్తులకు సంబంధించిన కీలక పత్రాలు, వివరాలు లభించినట్లు సమాచారం.

సోదాల అనంతరం మల్లారెడ్డిని నిజామాబాద్ నుంచి హైదరాబాద్‌కు తరలించిన అధికారులు, ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణలపై అరెస్టు చేసినట్లు వెల్లడించారు. ఈ కేసుకు సంబంధించి స్వాధీనం చేసుకున్న ఆస్తుల విలువ, తదుపరి విచారణ వివరాలను ఏసీబీ అధికారులు అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.

తెలంగాణలో ఇటీవల పలువురు ప్రభుత్వ అధికారులపై ఏసీబీ దాడులు జరుగుతుండగా, ఈ ఘటన మరోసారి రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

23 Jun 2026

Leave a Comment