యోగా దినోత్సవం సందర్భంగా ప్రముఖ యోగ గురువు రాజేందర్‌కు ఘన సన్మానం….

On: Sunday, June 21, 2026 6:03 PM

ఆర్మూర్ A9 న్యూస్:

అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆర్మూర్‌ పట్టణానికి చెందిన ప్రముఖ యోగ గురువు రాజేందర్ ని స్ఫూర్తి సేవ సొసైటీ సభ్యులు ఘనంగా సన్మానించారు. యోగా ద్వారా ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని ప్రజలకు చేరువ చేయడంలో ఆయన అందిస్తున్న సేవలను కొనియాడుతూ శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందజేసి అభినందనలు తెలిపారు.

ఈ సందర్భంగా సొసైటీ సభ్యులు రాస ఆనంద్ మాట్లాడుతూ, యోగా కేవలం వ్యాయామం మాత్రమే కాకుండా శారీరక, మానసిక ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని, రాజేందర్ అనేక మందికి యోగా శిక్షణ అందిస్తూ సమాజంలో ఆరోగ్య చైతన్యాన్ని పెంపొందిస్తున్నారని పేర్కొన్నారు.

రాజేందర్ మాట్లాడుతూ తనపై చూపిన గౌరవానికి స్ఫూర్తి సేవ సొసైటీ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవితంలో యోగాను భాగంగా చేసుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో స్ఫూర్తి సేవ సొసైటీ సభ్యులు, యోగా సాధకులు, పాల్గొని రాజేందర్ కి శుభాకాంక్షలు తెలియజేశారు.

21 Jun 2026

Leave a Comment