ఎయిర్ పోర్ట్ ప్రవాసి కేంద్రాన్ని
సందర్శించిన అనిల్ ఈరవత్రి .
సదాశివ్ A9 న్యూస్ ప్రతినిధి
హైదరాబాద్ :ఆగస్టు 31
గల్ఫ్ తదితర దేశాలకు వెళ్లే వారికి సలహాలు, సూచనలు ఇవ్వడానికి హైదరాబాద్ ఎయిర్ పోర్టులోని పై అంతస్తు లోని డిపార్చర్స్ ఆవరణలో నిర్వహిస్తున్న ‘ప్రవాసి సహాయత కేంద్రం’ (మైగ్రంట్స్ హెల్ప్ డెస్క్) ను మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్,అనిల్ ఈరవత్రి సందర్శించారు.ఆయన వెంట గల్ఫ్ కాంగ్రెస్ అధ్యక్షులు సింగిరెడ్డి నరేష్ రెడ్డి, టీపీసీసీ ఎన్నారై సెల్ కన్వీనర్ మంద భీంరెడ్డి ఉన్నారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కార్మిక, ఉపాధి శాఖ ఆధీనంలోని ‘తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ లిమిటెడ్’ (టాంకాం), జీఎంఆర్ సంస్థలు సంయుక్తంగా ఈ హెల్ప్‌డెస్క్‌ను నిర్వహిస్తున్నాయని ఈ సౌకర్యాన్ని గల్ఫ్ దేశాలకు వెళ్లే కార్మికులు ఉపయోగించుకోవాలని అనిల్ ఈరవత్రి ఈ సందర్బంగా కోరారు.
మరిన్ని వివరాల కోసం హెల్ప్ డెస్క్ మొబైల్ & వాట్సాప్ నెంబర్ +91 78935 66493 కు కాల్ చేయవచ్చు.