A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్:
ఆలూరు మండల బీజేపీ కార్యవర్గ సమావేశం పార్టీ అధ్యక్షులు గంగాధర్ గిరీష్ అధ్యక్షతన ఆలూరు మండల కేంద్రం లోని కుర్మ సంగం లో సమావేశం నిర్వహించడం జరిగింది. ఇట్టి సమావేశానికి ముఖ్య అతిథిగా బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి కలిగొట గంగాధర్, అతిథులుగా బీజేపీ సభ్యత్వ నమోదు ఆర్ముర్ అసెంబ్లీ కన్వీనర్ గంగోని సంతోష్, బీజేపీ ఓబీసీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు యాదగిరి, బీజేపీ ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్, మండల సభ్యత్వ కో కన్వీనర్ రాజేష్ లావణ్య ప్రసాద్, మల్లయ్య, లోక రామ్ రెడ్డి, విజయ్, సురేష్, హరీష్, బూత్ అధ్యక్షులు, శక్తి కేంద్ర ఇంచార్జులు, బీజేపీ కార్యవర్గ సభ్యులు, సీనియర్ నాయకులు పాల్గొన్నారు.
బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి కలిగొట గంగాధర్ మాట్లాడుతూ మొన్న జరిగిన అసెంబ్లీ, లోకసభ ఎన్నికల్లో కష్ట పడ్డట్లు అందరూ పార్టీ కొరకు సమయం ఇచ్చి ఇట్టి సభ్యత్వం ను విజయవంతం చెయ్యాలని, భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో భారత దేశం అభివృద్ధిలో, ప్రజా సంక్షేమంలో ముందుకు వెళ్తుంది అని, శ్యామ ప్రసాద్ ముఖర్జీ, దీన్ దయాలు ఉపాధ్యాయ, అటల్ జీ కలలు సహకారం నరేంద్ర మోడీ నాయకత్వంలో జరుగుతున్నాయని, అందుకు నిదర్శనం అయోధ్యలో రామ మందిరం నిర్మాణం, 370 ఆర్టికల్ రద్దు, అవినీతికి తావులేకుండా రామరాజ్యం నరేంద్ర మోడీ కే సాధ్యం అని, బీజేపీ లో ఒక కార్యకర్త సైనుకునితో సమానమని, మన రాష్ట్రం లో మొన్న బిఆర్ఎస్ ప్రభుత్వం, నేడు కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డగోలు హామీ ఇచ్చి ప్రజల నడ్డి విరుస్తున్నాయని, బీజేపీ వైపు ప్రజల చూపు మెండుగా ఉందని, బీజేపీ చెప్పిందే చేస్తుంది అని, చేశేదె చెపుతుంది అని, సమర్థ వంతమైన నాయకత్వంలో సుస్థిర ప్రభుత్వం బీజేపీ కే సాధ్యం అని, ఇక్కడ మొన్న గెలిసిన అసెంబ్లీ, లోకసభ అభ్యర్థులు ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి మరియు ధర్మపురి అరవింద్. ఈ ప్రాంత అభివృద్ధి కి కంకణం కట్టు కున్నారని, రామ రాజ్యమే వీరి ధ్యేయం అని, అందరూ కలసి కట్టుగా పార్టీ సభ్యత్వంన్ని పూర్తి చేసి రాబోయే స్థానిక ఎన్నికలకు సిద్ధం కావాలని తెలిపారు. బీజేపీ ఆర్ముర్ అసెంబ్లీ సభ్యత్వ కన్వీనర్ గంగోనె సంతోష్ మాట్లాడుతూ…. పార్టీ సభ్యత్వం బూత్ వారీగా సమావేశాలు ఏర్పాటు చేసుకొని ఒక లక్ష్యం తో పూర్తి చెయ్యాలని, ఆన్లైన్ పద్దతి లో కూడ నమోదు చేసుకోవచ్చు అని, 8800002024 అనే మొబైల్ కు మిస్సేడ్ కాల్ ఇచ్చి వచ్చే లింక్ లో మీరు వివరాలు నమోదు చెయ్యాలని, ఏమైనా ఇబ్బంది లు ఉంటే 8860147147 అనే టోల్ ఫ్రీ నంబరకు కూడ కాల్ చేసి పరిష్కారం చేసుకోవచ్చు అని, జిల్లా పార్టీ ప్రతినిధులు కూడ మీకు అందుబాటులో ఉంటారు.