A9 న్యూస్ ప్రతినిధి బాల్కొండ:
అల్ల కొండ చరిత్ర చాలా గొప్పదనీ ఆర్మూర్ ఆర్డిఓ
బి.రాజా గౌడ్ అన్నారు. ఖిల్లా లో పూర్వ కట్టడాలు రక్షించుకునే బాధ్యత ప్రతి ఒక్కరిధని అన్నారు. బాల్కొండ ఖిల్లా అభివృద్ధి కోసం పురావస్తు శాఖ అధికారులతో సంప్రదించి మరమత్తులు కోసం జిల్లా కలెక్టర్ ద్వారా ప్రభుత్వానికి నివేదిస్తమని అన్నారు. నిజామాబాదు జిల్లా బాల్కొండ లోపుస్తకవిష్కరణ కార్యక్రమంలో అయన ప్రశాంగించారు. ఈ కార్యక్రమంలో భాగంగా పూర్వ అల్ల కొండ ఖిల్లా చరిత్రను విద్యార్థులకు తెలియజేసీ విధంగా నిర్వహించడం గర్వ కారణమని ఆయన నిర్వహకుల్ని అభినందించారు. అనంతరం అల్ల కొండ ఖిల్లా చరిత్ర పుస్తకాన్ని ఆవిష్కరణ చేసారు. వ్యాసరచన క్విజ్ పోటీలలో గెలుపొందిన విద్యార్థిని విద్యార్థులకు యోగ్యత పత్రాలు బహుమతులతో పాటు “అల్ల కొండ ఊరు ఉద్భవo-ఐదు ఆలయాలకు ప్రసిద్ధి” పుస్తక రచయిత బుక్ లకు పంపిణీ చేసారు. బాల్కొండ మండల కేంద్రంలోని అన్ని పాఠశాలల విద్యార్థిని విద్యార్థులకు “అల్లకొండ ఖిల్లా పూర్వ చరిత్ర ” అంశంపై వ్యాస రచన పోటీలను నిర్వహించిన తేది 26-02- 2024.అలాగే “క్విజ్ పోటీలు” నిర్వహించిన తేది, 29-02-2024 సందర్భంగా బహుమతుల ప్రధానోత్సవ (30-08-2024) శుక్రవారo రోజు శాంభవి ఉన్నత పాఠశాల బాల్కొండ లో ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమం అల్లకొండ ఖిల్లా పరిరక్షణ సమితి మరియు నేషనల్ యూత్ ప్రాజెక్టు/యునైటెడ్ నేషన్స్ ఆఫ్ యూత్ ఆర్గనైజేషన్, దక్షిణ మైత్రి సదస్సు తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ సంయుక్తంగా వ్యాసరచన & క్విజ్ పోటీలలో గెలుపొందిన విద్యార్థిని విద్యార్థులకు బహుమతుల ప్రధానోత్సవం కార్యక్రమాలను
నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విశిష్ట అతిథిగా మోతే రామా గౌడ్ మాట్లాడుతూ నర్సింగ్ రావు
కృషి పట్టుదల వల్ల. ఈ కార్యక్రమం విజయవంతం జరగటo అభినంద నీయనని అన్నారు. అతిథి యం.శ్రీధర్, తహసిల్దార్ ఓవర్ ఆల్ చాంపియన్ షిప్ మదర్ థెరిస్సా, మైనారిటీ, శాంభవి ఉన్నత పాఠశాలకు బహు మతులు అందజేశారు.ఈ కార్యక్రమంలో భాగంగా సాంస్కృతిక కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శాంభవి చైర్మన్ బొట్ల మధుసూదన్ రాజు, అల్ల కొండ ఖిల్లా పరిరక్షణ సమితి అధ్యక్షులు బుసం సత్య నారాయణ సంయుక్త కార్యదర్శి సంతోష్, డి.పవన్ పాల్గొన్నారు.