A9 న్యూస్ ప్రతినిధి ఇందల్వాయి:
*ఇందల్వాయి వ్యాధుల పట్ల పిల్లలు జాగ్రత్తగా ఉండాలని సూచించిన డిపిఓ…
*తల్లిదండ్రులు పిల్లలకి జ్వరం వచ్చిన వెంటనే ఆసుపత్రిలో సంప్రదించాలని సూచించిన ఎంపీడీవో…
ఇందల్వాయి గ్రామ పంచాయతీ నందు డిపిఓ తరుణ్, ఇందల్వాయి ఎంపీడీవో అనంతరావు, పారిశుద్ధ్య పనులను పరిశీలించి ఎస్సీ బాలుర వసతి గృహం తనిఖీ చేయడం జరిగింది. ఈ మధ్యన సృజన వ్యాధులు డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ వంటి జ్వరాలు ఎక్కువ పిల్లలకు రావడం జరుగుతుందని దీనిపైన అప్రమత్తంగా ఉండాలని తల్లిదండ్రులు జాగ్రత్తతో ఉండాలని సూచించారు. జిల్లా పంచాయతీ అధికారి తరుణ్, ఎంపీడీఓ అనంత్ రావ్, ఎంపీవో రాజకాంత్ రావ్, గ్రామంలో డెంగ్యు మరియు ఇతర వైరల్ ఫీవర్ లను రాకుండా అరికట్టుటకు తీసుకోవలసిన తగు చర్యలను గురించి పంచాయతీ కార్యదర్శి, ఏఎన్ఎం, ఆశ వర్కర్స్ లకు ఆదేశించినారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి భరత్. వీడీసీ అధ్యక్షులు జితేందర్, ఫీల్డ్ అసిస్టెంట్ జెగ్గ రాములు, కారోబార్ పోచయ్య, ఆశ వర్కర్లు పాల్గొన్నారు.