A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్:
ఆర్మూర్ పట్టణ మరియు మండలం బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం సమావేశం బీజేపీ పట్టణ మండల అధ్యక్షులు ధ్యాగ ఉదయ్, రోహిత్ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ సమావేశం లో ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర కార్యదర్శి పల్లె గంగారెడ్డి, అతిథులుగా మాజీ మునిసిపల్ ఛైర్మెన్ కంచెట్టి గంగాధర్, బీజేపీ జిల్లా కార్యదర్శి, ఆర్ముర్ అసెంబ్లీ బీజేపీ సభ్యత్వ నమోదు కన్వీనర్ గంగోనె సంతోష్, కో-కన్వీనర్ జెస్సు అనిల్, బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి కలిగొట గంగాధర్, బీజేపీ సీనియర్ నాయకులు, సర్వసమాజ్ అధ్యక్షులు ఆకుల రాజు పాల్గొన్నారు. ఈ సమావేశంలో పట్టణ, మండల ప్రధాన కార్యదర్శిలు పోల్కం వేణు, రాజేందర్, బీజేపీ సీనియర్ నాయకులు, ప్రజా ప్రతినిధులు, బూత్ అధ్యక్షులు, శక్తి కేంద్ర ఇంచార్జిలు పాల్గొన్నారు..
పల్లె గంగారెడ్డి గారు మాట్లాడుతూ, జరిగిన అసెంబ్లీ, లోక సభ ఎన్నికల్లో సైనుకుల్లా పనిచేసి విజయం సాధించినట్లు గా అందరూ ఏకమై బీజేపీ సభ్యత్వాన్ని విజయవంతం చెయ్యాలని, శక్తి కేంద్ర ఇంచార్జిలు, బూత్ అధ్యక్షులు సమావేశం ఏర్పాటు చేసి అందరిని ఆహ్వానించాలి. ముఖ్యంగా యువకులను, బీజేపీ అభిమానం ఉన్నవాళ్లను గుర్తిoచి, ఒక్క బూత్ లో 200 మెంబర్షిప్ తగ్గకుండా చూడాలి.
మోడీ జాతీయ స్థాయిలో సెప్టెంబర్ 1వ తేదీ, ఇట్టి సభ్యత్వం ప్రారంభిస్తారని, అనంతరం మెంబర్షిప్ ప్రారంభం అవుతుందని, మండల స్థాయి మెంబర్షిప్ ఈవెంట్స్ కూడ ఒక పండుగుల జరుపుకోవాలని, ఇంటింటికి వెళ్లి సభ్యత్వన్ని చెయ్యాలని, కష్ట పడడం బీజేపీ కార్యకర్తలు అలవార్చుకున్నారని, మోడీజీ భారత దేశం అభివృద్ధి కొరకు కంకణం కట్టుకున్నారాని, అసాధ్యాన్ని సుసాధ్యం చేయడం మోడీజీకి అలవాటు అని, మోడీజీ ని ప్రపంచం విశ్వ గురువుగా చూస్తుంది అని, భారత దేశానికి బీజేపీ నాయకత్వం చాలా అవసరమని, మోడీజీ నాయకత్వం రామ మందిరం నిర్మిoచమని, 370 ఆర్టికల్ రద్దు చేశారాని, బడుగు బలహీనుల అభివృద్ధి ద్యేయంగా మోడీజీ పని చేస్తున్నారని, శ్రీ దిన్ దయల్, శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ, వాజపేయి, అద్వానీ ప్రారంభించిన బీజేపీ పార్టీ లో పనిచేయడం మన అదృష్టం అని, వారి ఆశయాలను మనం ముందుకు తీసుకొని వెళ్లాలని తెలిపారు.
గంగోని గంగాధర్ మాట్లాడుతూ….
బీజేపీ సభ్యత్వాన్ని సెప్టెంబర్ 4న ప్రారంభించి తొందరగా పూర్తి చెయ్యాలని, ఇట్టి ఆన్లైన్ పద్ధతిలో కూడ ఉంది అని, సాధారణ సభ్యత్వనికి ఎలాంటి రుసుము లేదని, క్యూఆర్ కోడ్ ధ్వారా, 8800002024 ఫోన్ నంబరకు మిస్సేడ్ కాల్ ఇచ్చి వచ్చే లింక్లో వివరాలు నమోదు చేసి కూడ సభ్యత్వాన్ని చేసుకోవచ్చని, రాష్ట్రంలో ఆర్ముర్ అసెంబ్లీలో బీజేపీ సభ్యత్వంలో ముందుండాలి అని కోరారు. అందరూ కష్టపడి బీజేపీ సభ్యత్వన్ని బీజేపీ రాష్ట్ర కమిటీ ఇచ్చిన సమయానికి ముందే పూర్తి చెయ్యాలని కోరారు.