A9 న్యూస్ ప్రతినిధి జాక్రంపల్లి:
*ఎస్.జె.డబ్ల్యూ.హెచ్.ఆర్.సి మండల అధ్యక్షునిగా తొగరి సాయిలు నియమికం…
*అధికారిక నియామక పత్రం అందచేసిన జిల్లా అధ్యక్షులు కొప్పు రాజేందర్…
జక్రాంపల్లి సోషల్ జస్టిస్ ఫర్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ మండల అధ్యక్షులుగా జక్రాంపల్లి మండల కేంద్రానికి కు చెందిన తొగరి సాయిలు ను నేషనల్ చైర్మన్ డాక్టర్ కొప్పుల విజయ్ కుమార్ అధికారికంగా నియమించారు. జక్రాంపల్లి మండల ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన సమావశంలో జిల్లా అధ్యక్షులు కొప్పు రాజేందర్ నియమిక పత్రం సంస్థ గుర్తింపు కార్డు అందచేశారు ఈసందర్భంగా కొప్పు రాజేందర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మానవ హక్కుల పరిర్షణకు కృషి చేయాలని కోరారు. ప్రభుత్వానికి, పోలీసులకు తాము సహకారంగా ఉంటామని తెలిపారు. రాజ్యాంగము కల్పించిన హక్కులకు ఎవరైనా భంగం కలిగిస్తే జాతీయ మానవ హక్కుల కమిషన్ లో కేసు ఫైల్ చేసి నిజమైన భాదితులకు అండగా ఉంటామని పేర్కొన్నారు. మండల అధ్యక్షులు గా తొగరి సాయిలు బాధ్యతగా పని చేసి న్యాయం చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. అనంతరం తొగరి సాయిలు మాట్లాడుతూ తన నియామకానికి సహకారం అందించిన నేషనల్ జనరల్ సెక్రెటరీ మామిడాల మనోహర్ కి, సౌత్ ఇండియా చైర్మన్ హన్మ గౌడ్ కి, రాష్ట్ర చైర్మన్ నోముల సంపత్ గౌడ్ కి ధన్యవాదములు తెలిపారు . నాకు అప్పగించిన భాద్యతలను బాధ్యతగా నిర్వహిస్తానని, భారత రాజ్యాంగానికి, చట్టానికి కట్టుబడి పని చేస్తానని ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైస్ ఛైర్మన్ ఏనుగంటి రాజశేఖర్, రాష్ట్ర సెక్రెటరీ బట్టి దత్తాత్రి గౌడ్, జిల్లా కార్యదర్శి పసుల ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.