A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్:

యూనివర్సల్ మెంటార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ద పార్క్ హోటల్ హైదరాబాద్ లో జరిగిన ఎడ్యుకేషన్ లీడర్ సుమిత్ & అవార్డ్స్ సమ్మేళనంలో శ్రీ భాషిత పాఠశాల కరస్పాండెంట్ పోలపల్లి సుందర్ కి ఎడ్యుకేషన్ ఐకాన్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్ 2024 ఇవ్వడం జరిగింది. శ్రీ భాషిత పాఠశాల కరస్పాండెంట్ పోలపల్లి సుందర్, విద్యార్థులకు పరిశోధనాత్మకమైన విద్యను అందించి విద్యార్థుల జీవన మనుగడకు ఎంతో కృషి చేస్తున్నారు. విద్యలో నూతనమైన మార్పులను తీసుకొస్తూ సమాజానికి అవసరమయ్యే పౌరులను తయారు చేయడానికి తన వంతు కృషి చేస్తున్నారు.అంతేకాకుండా విద్యార్థులకు 10 సంవత్సరాల తరువాత తన జీవిత లక్ష్యం ఏమిటో ఇప్పుడే నిర్ణయించుకొని ఆ కల సాకారం అయ్యేంతవరకు ప్రయత్నం చేయాలని విద్యార్థులను ఎప్పుడూ కూడా ఉత్తేజ భరితుల్ని చేస్తుంటారు. ఈ అవార్డు ప్రధానోత్సవంలో ముఖ్య అతిథులుగా డాక్టర్ శేఖర్ జాయిన్ సీఈవో మరియు కో-ఫౌండర్ ఓమోటెక్, సందీప్ గులాటి, ఫౌండర్, యూనివర్సల్ మెంటోరస్ అసోసియేషన్, వారి చేతుల మీదుగా అవార్డు ప్రధానోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో ట్రస్మ స్టేట్ ప్రెసిడెంట్ సాదుల మధుసూదన్, మరియు స్టేట్ సెక్రటరీ రాఘవేంద్ర రెడ్డి పాల్గొన్నారు.

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *