A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్:
అంతర్జాతీయ సీనియర్ సిటీజన్స్ దినోత్సవాన్నీ పురస్కరించుకొని ఆర్మూర్ పట్టణంలోని సుమారు 13 సీనియర్ సిటిజన్ ఫోరం సభ్యులకు జి జి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించి ఆత్మీయ శుభాకాంక్షలు తెలియజేసిన జిజి ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు లయన్ నివేదన గుజరాతి ఎం జె ఎఫ్ అనంతరం ఫోరమ్ అధ్యక్షలు దొండి నారాయణ్ వర్మ మాట్లాడుతూ నేటి సమాజంలో సమాజ అభివృద్ధి కొరకు సీనియర్ సిటీజన్ పాత్ర చాలా పెద్ద ఎత్తున ఉంటుందని వారి అమూల్యమైన అభిప్రాయాలు సమాజ అభివృద్ధికి తీసుకోవాలని వారు సూచించారు. అందులో భాగంగానే ఇట్టి కార్యక్రమంలో జి జి ఫౌండషన్ వ్యవస్థాపక అధ్యక్షులు లయన్ నివేదన్ గుజరాతి ఎం జె ఎఫ్ లు మాట్లాడుతూ అంతర్జాతీయ సీనియర్ సిటీజన్ దినోత్సవం యూఎస్ లో 1988 లో ఆగస్టు 21 తేదీ నాడు నాటి అమెరికా అధ్యక్షలు రోనాల్డ్ రిగాన్ ఇట్టి దినోత్సవాన్ని అధికారికంగా ప్రకటించడం జరిగిందని అదేవిధంగా సీనియర్ సిటిజన్ హక్కుల న్యాయవాది మాజీ అమెరికా అధ్యక్షులు బెంజిమన్ హరిసన్ జన్మదినాన్ని పురస్కరించుకొని యావత్తు ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 21 నాడు ఇట్టి కార్యక్రమాన్ని జరుపుకుంటారని కొనియాడారు ఇట్టి సన్మానం పొందిన వారిలో ఫోరం అధ్యక్షులు దొండి నారాయణ వర్మ, కార్యదర్శి సి.హెచ్. గంగాధర్, కోశాధికరి ఏం.సాయన్న, విశ్రాంతి ఉద్యోగ సంఘ, అధ్యక్షులు రామ్ రెడ్డి, కార్యదర్శి రాజేశ్వర్ రెడ్డి, మల్లరెడ్డి, ముత్యన్న, గడ్డం శ్రీనివాస్ రెడ్డి, అల్జాపూర్ గంగా మోహన్, ఒడ్డెన్న, లక్ష్మారెడ్డి, సుదర్శన్, ఈనాడు నర్సయ్య, జిందం నరహరి, నర్సింలూ, రోటరీ క్లబ్ ఆఫ్ ఆదర్ష్ మాజీ అధ్యక్షులు డిజే దయానంద్, ఫౌండషన్ ప్రతినిధులు బేల్దారి శ్రీనివాస్, జెస్సు ఆనంద్, కాశీనాథ్, సునీల్, బొచ్కర్ వేణు తదితరులు పాల్గొన్నారు.