A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్:
ఆర్ముర్ పట్టణం లోని ఎం ఎల్ ఎ క్యాంపు కార్యాలయం లో గల శ్రీ నాగలింగేశ్వర ఆలయం లో రాఖీ పౌర్ణిమ సందర్భంగా నేడు సాయంత్రం శివ లింగానికి ప్రత్యేక పూజలు, ఆరతి నిర్వహించి, భక్తులకు అన్నదానం, అల్పాహారం ఏర్పాటు చేశారు, జామల్పూర్ లతికా – రాజవీర్, కే. పుష్ప – నర్సయ్య (వయసు ), ధత్తు లు అన్నదాణం, అల్పాహారo ఏర్పాటు చేశారు. సాయంత్రం ఆరతి తరువాత దాదాపు 450 భక్తులు అల్పాహారాన్ని అన్నదానాన్ని స్వకరించారు. ఆలయ కమిటి ప్రతినిధులు లోకం శ్రీనివాస్, అంబికా రమేష్, జామల్పూర్ బాలాజీ, నోముల శ్రీనివాస్, గజవాడ రాజయ్య, కలిగొట గంగాధర్, పూజారి నారాయణ ఏర్పాట్లను చూశారు. ఆలయ ప్రతినిధులు మాట్లాడుతూ ప్రతి సోమవారం రోజున సాయంత్రం హారతి తరువాత అల్పాహారం, ప్రతి మాసం లో పౌర్ణమి రోజున అల్పాహారం తో పాటు అన్నదానం ఉంటుందని, భక్తులు ముందుకు వచ్చి పుట్టినరోజు వివాహ దినోత్సవ రోజులు ఉంటే ఇట్టి అన్నదానాన్ని, అల్పాహారని దాతలుగా ముందుకు వస్తారని తెలిపారు. ఆలయ ప్రతినిధులుగా మేము ఏర్పాట్లు చూస్తామని తెలిపారు.