A9 న్యూస్ ప్రతినిధి భీంగల్, ఆగస్టు 16:
శ్రీ సరస్వతి విద్యా మందిర్ ఉన్నత పాఠశాల భీంగల్ లో సామూహిక వరలక్ష్మి వ్రత కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రతి సంవత్సరం శ్రావణమాసం శుక్లపక్షంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారాన్ని వరలక్ష్మి వ్రతం గా జరుపుకోవడం ఒక హిందూ ఆచారం. ముఖ్యంగా వివాహమైన మహిళలు వరలక్ష్మి దేవిని పూజిస్తే అష్టైశ్వర్యాలైన సంపద, భూమి, శిక్షణ, ప్రేమ, కీర్తి, శాంతి, సంతోషం, శక్తి, లభిస్తాయని నమ్మకం. పాఠశాలలో జరిగిన. ఈ కార్యక్రమంలో పురోహితులు శ్రీ యోగేష్ జోషి, వ్రత కార్యక్రమానికి వచ్చిన మాతృమూర్తులు మరియు పాఠశాలలో పనిచేస్తున్న మహిళా ఉపాధ్యాయులచే సామూహికంగా వరలక్ష్మీ వ్రత కార్యక్రమాన్ని చేయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల అధ్యక్షులు డాక్టర్ జి. బసంత్ రెడ్డి, సతీమణి కౌసల్య దేవి, ఉపాధ్యక్షులు వి. శంకర్, పాఠశాల కార్యదర్శి జి. నర్సయ్య, వారి సతీమణి విజయ, పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు, ప్రధానాచార్యులు రాస రవికుమార్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ జి. నర్సారెడ్డి, ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.