A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్, ఆగస్టు 16:
రాష్ట్ర స్థాయి ఉత్తమ జిల్లాగా నిజామాబాద్
– స్టార్ ఆఫ్ ద ఐకాన్లుగా అనీఫ్, వినోద్
నేషనల్ హ్యూమన్ రైట్స్ జస్టిస్ ఫర్ మూమెంట్ ఆధ్వర్యంలో హైదరాబాదులో సుందరయ్య విజ్ఞాన్ భవన్ బాగ్ లింగంపల్లిలో నిర్వహించిన ప్రోగ్రాంలో నిజామాబాద్ జిల్లా వారు చేస్తున్న సేవలను గుర్తించి రాష్ట్రస్థాయిలో వారికి ప్రథమ బహుమతి ఇవ్వడం జరిగింది. అలాగే జిల్లా నుండి 2024 సంవత్సరం గాను స్టార్ ఆఫ్ ద ఐకాన్లుగా అనీఫ్, వినోద్ లకు అవార్డులను అందజేశారు. నేషనల్ హ్యూమన్ రైట్స్ జస్టిస్ ఫర్ మూమెంట్ నేషనల్ చీఫ్ సెక్రటరీ షబ్బీర్ ఆలీ మాదాని మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్రంలో నిజామాబాద్ జిల్లా వారు చేస్తున్న సేవలను గుర్తించి ఉత్తమ జిల్లా అవార్డును నిజామాబాద్ జిల్లా సభ్యులకు అందజేయడం జరిగింది. అలాగే ప్రతి ఒక్కరు నిజామాబాద్ జిల్లాను వారు చేస్తున్న సేవలను ఆదర్శంగా తీసుకోవాలని మిగతా జిల్లాల సభ్యులందరినీ ప్రోత్సహించారు. ప్రతి ఒక్క జిల్లా కూడా నిజామాబాద్ జిల్లాని ఆదర్శంగా తీసుకుంటూ జిల్లాలో సేవా కార్యక్రమాలలో ముందుండాలని ఆయన అన్నారు. నిజామాబాద్ జిల్లాలో అధ్యక్షులు, ఉపాధ్యక్షులు సేవా కార్యక్రమాలలో ముందుంటూ జిల్లా యొక్క బాధ్యతలను తమ యొక్క భుజస్కందాలపై వేసుకుంటూ సమస్యల పరిష్కరించడంలో ముందున్నారు అని తెలపడం జరిగింది. నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు, ఉపాధ్యక్షులు అనీఫ్, వినోద్ లు మాట్లాడుతూ… రాష్ట్రంలో 33 జిల్లాలు ఉన్న మన నిజామాబాద్ జిల్లాకి ఉత్తమ జిల్లా స్థాయి అవార్డు రావడం ఆనందంగా ఉందని వారు అన్నారు. జిల్లాలో ఎక్కడ ఎవరికైనా ఎటువంటి సమస్య వచ్చిన న్యాయం జరగలేదు అనే ఉద్దేశంతో ఉన్నవారు మమ్మల్ని సంప్రదించవచ్చు అని, మీకు సరియైన న్యాయం జరిగే వరకు అండగా ఉంటామని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రస్థాయి అధ్యక్షులు, జిల్లాల అధ్యక్షులు ఉపాధ్యక్షులు, అనీఫ్, వినోద్ లు పాల్గోన్నారు.