A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్:

ఆర్మూర్ మున్సిపాలిటీ పరిధిలో భారతీయ జనతా యువమోర్చా ఆధ్వర్యంలో మంగళవారం రోజు భారీ ఎత్తున హర్ ఘర్ తిరంగా ర్యాలీ అంబేద్కర్ చౌరస్తా నుండి చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బిజెపి రాష్ట్ర కార్యదర్శి పల్లె గంగారెడ్డి విచ్చేశారు, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి వ్యక్తి దేశభక్తి అలవర్చుకోవాలని ముష్కరుల నుంచి దేశాన్ని కాపాడుకోవడానికి కంకణబద్ధులై ఉండాలని యువతకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బిజెపి పట్టణ అధ్యక్షుడు ద్యాగ ఉదయ్, బిజెపి సీనియర్ జెస్సు అనిల్, ఆకుల శ్రీనివాస్, కంచెట్టి గంగాధర్, బోట్ల విజయ్, నూతుల శ్రీనివాస్ రెడ్డి, బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి మందుల బాలు, బిజెపి పట్టణ ప్రధాన కార్యదర్శి పులి యుగంధర్, బిజెపి నాయకులు మీసాల రాజేశ్వర్, విజయానంద్, మందుల పోశెట్టి, బీజేవైఎం పట్టణ అధ్యక్షుడు కలిగోట ప్రశాంత్, బీజేవైఎం నాయకులు నరేష్, చారి, ఉదయ్ గౌడ్, భరత్ తదితరులు పాల్గొన్నారు.

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *