A9 న్యూస్ మాకూర్ ప్రతినిధి:
నిజామాబాద్ జిల్లా మాకూర్ మండలం మదనపల్లి గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో స్వచ్ఛతనం పచ్చదనం కార్యక్రమం లో భాగంగా ఐదవ రోజు ప్లాస్టిక్ పై ప్రజలకు అవగాహన కొరకు ప్లాస్టిక్ భూతంగా ఒక వ్యక్తిని తయారుచేసి గ్రామంలో వీధి వీధి తిరుగుతూ ప్రజలకు ప్లాస్టిక్ వాడొద్దు చేతి సంచులు వాడాలి, పర్యావరణాన్ని కాపాడండి, ప్లాస్టిక్ భూమిలో కరగడానికి 1000 సంవత్సరాలు పడుతుంది దీనివల్ల భూమిలో నీరు ఇనుకదు, దోమలు ఈగలు ప్లాస్టిక్ కవర్ ని స్థావరంగా చేసుకొని క్యాన్సర్, ఊపిరితిత్తిలో వ్యాధులు వస్తాయి అని అవగాహన కల్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రత్యేక అధికారి గిరీష్ కుమార్, పంచాయతీ కార్యదర్శి చంద్రశేఖర్, గ్రామ వైద్యాధికారి శ్రీలేఖ, ఏఎన్ఎం భగీరథ, అంగన్వాడీ టీచర్స్, ఆశ వర్కర్స్ గ్రామపంచాయతీ సిబ్బంది గ్రామ ప్రజలు పాల్గొన్నారు.