Tuesday, November 26, 2024

డాక్టర్ అంబేద్కర్ పాలాభిషేకం చేసిన రాష్ట్ర అధ్యక్షుడు గోవింద్ పెట్ నరేష్

spot_img
- Advertisement -spot_imgspot_img
- Advertisement -spot_imgspot_img

A9 న్యూస్ ప్రతినిధి:

హైదరాబాద్ ట్యాంక్ బండ్ వద్ద సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును శిరసా వహిస్తూ. ఎమ్మార్పీఎస్ ఎంఎస్ఎఫ్ నాయకులు, భారతరత్న బాబాసాహెబ్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కి పాలాభిషేకం చేసి పూలమాలలు వేశారు. అనంతరం రాష్ట్ర అధ్యక్షులు గోవింద్ నరేష్ మాట్లాడుతూ మాదిగలు మాదిగ ఉపకులాల అయినటువంటి 57 కులాలు అయినటువంటి వారికి అన్ని రంగాల్లో ఉపాధి అవకాశాలు లభిస్తాయని రాబోయే తరాల కోసం మాన్య మందకృష్ణ మాదిగ గత 30 సంవత్సరాలుగా ఎస్సీ వర్గీకరణ కోసం. ఎన్నో ఉద్యమాలు చేసి అవమానాలు అపనిందలు పడిన ఎస్సీ వర్గీకరణ ధ్యేయంగా ముందుకెళ్లారు. రాదు కాదు అన్నదాన్ని తీసుకొచ్చి చూపించారు మన్యశ్రీ మంద కృష్ణ మాదిగ తో వర్గీకరణ కాదు అన్న దశలో అలుపెరగకుండా ఎలాగైనా సాధిస్తాం అని దృఢ సంకల్పంతో ఉన్న నా మాదిగ మాదిగ ఉపకులాలు. దృఢ సంకల్పంతో. అందరి సహకారంతో.. 30 ఏళ్లుగా వేచి 

ఎదురుచూస్తున్న సమయంలో ఢిల్లీ సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది ఈ సుప్రీం కోర్టు బెంచ్ ఏడుగురి ధర్మ శాసనం. ఆలోచించి మాదిగ, మాదిగ 57 ఉప కులాల జరుగుతున్న అన్యాయం గురించి చర్చించి. అవును అవును ఇది న్యాయమైన డిమాండ్ అని మాదిగలకు ఇవ్వాలని ఎస్సీ వర్గీకరణ ఇవ్వాలి అని తుదితీర్పునిచ్చింది. సుప్రీంకోర్టు. !! ఇది జీర్ణించుకొని కొంతమంది మాల మాజీ ఎమ్మెల్యేలు, ప్రభుత్వానికి అధికారులకు పీఏలుగా ఉన్న వారు కావాలని కొంతమందిని రెచ్చగొట్టి, రాష్ట్ర ప్రభుత్వం వర్గీకరణ చేయొద్దంటూ కొంతమంది మాల మహానాడు నాయకులు వర్గీకరణ ఇస్తే మాలమదిగలు విడిపోతారని అపోలో ఉన్నారు అది అబద్ధం మాలల్లో కూడా వెనుకబడిన వారికి కూడా ఈ ఫలాలు, చెందిన వర్గీకరణ ఉంటుందని విలేకరుల సమావేశంలో రాష్ట్ర అధ్యక్షులు గోవింద్ నరేష్ మాదిగ తెలిపారు.. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును గౌరవించ పోతె భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ని అవమానించడమే అని ఆయన పత్రిక ముఖంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు, సుశాంత్, నిజామాబాద్ జిల్లా నాయకులు ఇందారపు రాజు, ఖైరతాబాద్ జిల్లా నాయకులు రొట్టె వంశీ, హైదరాబాద్ జిల్లా ఉపాధ్యక్షుడు సునీల్, ఎంఎస్ఎఫ్ నాయకులు అరవింద్, ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు ఎంఎస్ఎఫ్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

+ posts
- Advertisement -spot_imgspot_img
Latest news
spot_img
- Advertisement -spot_img
Related news
- Advertisement -spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here