బీయర్ఎస్ వి బూటకపు ధర్నాలు,రాస్తారోకోలు
భీంగల్ మండల కాంగ్రెస్ ప్రెసిడెంట్ బొదిరే స్వామి
*సదాశివ్ A9 న్యూస్ ప్రతినిధి బాల్కొండ నియోజకవర్గం
జులై 30:
బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు చేసిన ధర్నా , రాస్తా రోకో అన్నీ బూటకమని వారు ఎన్ని ధర్నాలు చేసిన పట్టించుకునే స్థితిలో ప్రజలు లేరని,బీయర్ఎస్ నాయకులు నిర్వహించిన ధర్నాలో కాంగ్రెస్ పార్టీ నాయకులు సునీల్ కుమార్, ఈరవాత్రి అనిల్, మానాల మోహన్ రెడ్డిలను విమర్శించడం వారి దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని భీంగల్ మండల కాంగ్రెస్ ప్రెసిడెంట్ బొదిరే స్వామి అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయం లో నిర్వహించిన ప్రెస్ మీట్ లో మాట్లాడారు. గత పది సంవత్సరాల బీయర్ఎస్ పాలనలో ఎవరు మొరం దందా గంజాయి మాఫియా, ఇసుక మాఫియా నడిపరో భూ కబ్జాలు చేశారో, వీటిని ఎంక్రెజ్ చేశారో నియోజకవర్గం లో ప్రజలకు తెలుసునాన్నారు. అందుకే ప్రజలు కాంగ్రెస్ ను అధికారంలోకి తెచ్చి బీయర్ఎస్ ను ప్రతిపక్షం లో ఉంచారన్నారు. ఇటీవలే ఏర్పడిన ప్రజల ప్రభుత్వం కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చే పనిలో నిమగ్నమైందన్నారు. రెండు దఫాల్లో రూ. 2.లక్షల ఋణ మాఫీ చేసినందుకు రైతులు సంతోషంగా ఉన్నారని, అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు. మరోసారి కాంగ్రెస్ పార్టీ పై గాని, నాయకుల పై గాని అసత్యపు ఆరోపనులు చేస్తే తగిన మూల్యం చెల్లించుకోకట్టప్పదన్నారు. రానున్న లోకల్ బాడీ ఎన్నికల్లో ప్రజల ఆశీర్వాదం తో విజయ డంక మోగించడం ఖాయమన్నారు. ఈ ప్రెస్ మీట్ లో పార్టీ పట్టణ అధ్యక్షులు జె. జె నర్సయ్య, జిల్లా సెక్రటరీ కుంట రమేష్, ఎస్సీ సెల్ మండల ప్రెసిడెంట్ అనంతరావు నాయకులు మల్లెల లక్ష్మన్, రాజేష్, షాదుల్లాహ్, మీరాజ్, శ్యామ్ రాజ్, రంజిత్, నవీన్, శ్రీను, నవీద్, ప్రవీణ్, సేవాలాల్, ఆకాష్, చంద్రం, జుబేర్, దిషన్, ఆజర్ తదితరులు పాల్గొన్నారు.