A9 న్యూస్ ప్రతినిధి ఏప్రిల్ 24:

కార్పోరేట్ కు ధీటుగా భీంగల్ శ్రీనివాస రామానుజం జూనియర్ కళాశాల ఫలితాలు రాష్ట్ర స్థాయిలో బై పి సి లో వరుసగా 

8,9,10వ ర్యాంకులు సాధించిన శ్రీనివాస రామానుజం జూనియర్ కళాశాల విద్యార్థులు.

గ్రామీణ ప్రాంతం లో అనిముత్యాలను వెలికితీసి ప్రతిభావంతులుగా తీర్చిదిద్దడం లో కళాశాల యాజమాన్యం. అధ్యాపకుల బృందం పనితీరు వర్ణనాతీతం ఈ ప్రపంచంలో చదువుతోనే అన్ని జయించగలం అనే గొప్ప సంకల్పంతో.. గ్రామీణ ప్రాంతాలలో ఉండే పేద మధ్యతరగతి విద్యార్థులకు చదువును అందించడమే లక్ష్యంగా “శ్రీనివాస రామానుజం జూనియర్ కళాశాల” స్థాపించిన మొదటి సంవత్సరంలోనే కార్పోరేట్ కళాశాలలకు ధీటుగా కని విని ఎరుగని రీతిలో భీంగల్ పట్టణంలోనే మొదటి సారి అతి తక్కువ విద్యార్థులతో అత్యుత్తమ ఫలితాలను సాధించింది శ్రీనివాస రామానుజం జూనియర్ కళాశాల. 

బైపిసి లో 

427/440 తో శ్రీనిత్య మొదటి స్థానం

 426/440 తో హరిని రెండవ స్థానం 

425/440 తో జోష్ణా మూడవ స్థానంలో నిలవగా

ఎంపిసి విభాగంలో

445/470 తో సుమిత్ మొదటి స్థానం

441/470 తో వాసవి రెండవ స్థానం లో నిలిచారు.. 

వారికి కళాశాల ప్రిన్సిపాల్ సంకెపల్లి రణదేవ్, యాజమాన్యం మరియు అధ్యాపక బృందం అభినందనలు తెలిపారు.. ప్రిన్సిపాల్ రణదేవ్ మాట్లాడుతూ.. పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చని .. దానికి నిదర్శనం మా విద్యార్థులు అని అన్నారు…మా కళాశాల విద్యార్థులు 90% ఉత్తీర్ణత సాధించారు అని తెలిపారు… వారి విజయాన్ని కళాశాల మరియు తల్లి దండ్రుల విజయంగా భావిస్తున్నాం అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *