*రాయల్ టైక్వాండో ఆధ్వర్యంలో బెల్ట్ టెస్ట్ ప్రమోషన్
* ముఖ్య అతిథులుగా హాజరైన ఎస్.హెచ్.ఓ రవికుమార్, మున్సిపల్ కమిషనర్ రాజు
A9 న్యూస్ ఆర్మూర్ ప్రతినిధి:
ఆర్మూర్ పట్టణంలో గల రాయల్ టైక్వాండో అకాడమీ ఆధ్వర్యంలో మాస్టర్ సాంబాడి ప్రవీణ్ కుమార్ శిక్షణలో శిక్షణ పొందుతున్న విద్యార్థిని విద్యార్థులకు బెల్ట్ ప్రమోషన్ టెస్ట్ స్థానిక క్షత్రియ సమాజ్ కళ్యాణ మండపంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఆర్మూర్ పట్టణ ఎస్.హెచ్.ఓ రవికుమార్ మరియు ఆర్మూర్ మున్సిపల్ చైర్మన్ రాజు హాజరు కావడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్.ఎస్.ఓ రవికుమార్ మాట్లాడుతూ పోటీ ప్రపంచంలో విద్యార్థులకు సేఫ్టీ ముఖ్యమని చదువుతోపాటు మనోధైర్యం ఉండాలని ఆయన తెలియజేశారు. తల్లిదండ్రులు విద్యార్థులతో కఠినంగా కాకుండా ప్రేమతో ఉండాలని ఇంట్లో తల్లిదండ్రుల ప్రవర్తన పిల్లల పైన ప్రభావం చూపకుండా ప్రేమానురాగాలతో మెలగాలని తెలియజేశారు. పిల్లల సక్సెస్ మరియు ఫెయిల్యూర్ తల్లిదండ్రులపైనే ఆధారపడి ఉందని వారు అన్నారు. మున్సిపల్ కమిషనర్ రాజు మాట్లాడుతూ ఈ రోజులలో ముఖ్యంగా ఆడపిల్లలకు సెల్ఫ్ డిఫెన్స్ ముఖ్యమని అన్నారు తల్లిదండ్రులు పిల్లలపై శ్రద్ధ తీసుకొని సమ్మర్ లోనైన విద్యార్థులకు సెల్ఫ్ డిఫెన్స్ పాఠాలను నేర్పిస్తే పిల్లలు జీవితంలో మనోధైర్యంతో ముందుకు సాగుతారని వారు తెలియజేశారు. ఎంతో ఓపికతో విద్యార్థులకు సెల్ఫ్ డిఫెన్స్ పాఠాలను నేర్పిస్తున్న టైక్వాండో మాస్టర్ సాంబాడి ప్రవీణ్ కుమార్ ని ఎస్.హెచ్ .ఒ రవికుమార్ ,కమిషనర్ రాజులు అభినందించడం జరిగింది.ఈ సందర్భంగా బెల్ట్ ప్రమోషన్ టెస్టులో పాస్ అయిన విద్యార్థులకు ఎస్.హెచ్.ఓ మరియు కమిషనర్ చేతుల మీదుగా నూతన బెల్టులను అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాయల్ తైక్వాండో అకాడమీ విద్యార్థులు వారి తల్లిదండ్రులు తదితరులు పాల్గొనడం జరిగింది.