*జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు*
*అగ్ని ప్రమాదాల నివారణకు ముందు జాగ్రత్తలు అవసరం*
A9 న్యూస్ ప్రతినిధి జితేందర్ ఇందల్వాయి
నిజామాబాద్, ఏప్రిల్ 13 : అగ్ని ప్రమాదాల నివారణకు అప్రమత్తతో కూడిన ముందు జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉందని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు హితవు పలికారు.
అగ్ని ప్రమాదాలు నివారణకు ప్రతి ఒక్కరు తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు. అగ్నిమాపక వారోత్సవాలను పురస్కరించుకుని అగ్నిమాపక సేవల శాఖ ఆధ్వర్యంలో ముద్రించిన కరపత్రాలను, గోడప్రతులను కలెక్టర్ శనివారం
సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని తన క్యాంప్ ఆఫీసులో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, విపత్తులు గోదాములలో, షాపింగ్ మాల్ లో ప్రమాదాలు జరగకుండా యజమానులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈనెల 14 నుంచి 20వ తేదీ వరకు వారం రోజులపాటు అగ్నిమాపక వారోత్సవాలు నిర్వహిస్తారని తెలిపారు. అగ్ని ప్రమాదాలు జరగకుండా తీసుకోవలసిన జాగ్రత్తలను అగ్నిమాపక శాఖ అధికారులు ప్రజలకు అవగాహన కల్పిస్తారని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా అగ్నిమాపక కేంద్రం అధికారి మురళీ మనోహర్ రెడ్డి, ఏడీఎఫ్ఓ భీమ్ ప్రణబ్, నర్సింగ్ రావు, సిబ్బంది పాల్గొన్నారు.
—————————
నిజామాబాద్ జిల్లా పౌర సంబంధాల అధికారి గారిచే జారీ చేయనైనది