A9 న్యూస్ ప్రతినిధి జిత్తు భాయ్ ఇందల్వాయి పోలీస్ స్టేషన్ పరిధిలోని 44వ నెంబర్ జాతీయ రహదారిపై శుక్రవారం రాత్రి 8 గంటల ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందగా మరో ఇద్దరికీ తీవ్ర గాయాల పాలైనట్లు ఎస్సై మనోజ్ తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం ఎల్లారెడ్డి పల్లె గ్రామ శివారులోని స్టోన్ క్రషర్ లో పనిచేస్తున్న నరేందర్ ఆశిష్ బబ్లు మృతుడి వయసు 45 సంవత్సరాలు అతనిది మధ్యప్రదేశ్ రాష్ట్రం భార్య ముగ్గురు పిల్లలు ఉన్నారుఅనే కార్మికులు క్రషర్ కి చెందిన వాహనంలో డీజిల్ తెచ్చేందుకు పెట్రోల్ బంకు వెళ్లే క్రమంలో గంగారం తండా వద్ద ముందర ఉన్న లారీని అతివేగంతో ఢీకొట్టడం ఈ ప్రమాదం జరిగింది… ప్రమాదంలో వాహనం నడుపుతున్న నరేందర్ ఆశిష్ కి గాయాలు కాగా బబ్లు మృతి చెందినట్లు తెలిపారు.. మృత దేహాన్ని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి మార్చిలోకి తరలించినట్లు.. తోటి కార్మికుడు ముత్యాల సాగర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు, ఎస్సై మనోజ్ కుమార్ తెలిపారు