A9 న్యూస్ ఆర్మూర్ ప్రతినిది:
కానూరి వెంకటేశ్వరరావు జీవితం ప్రజా కళాకారులకు ఆదర్శమని అఖిలభారత రైతు
కూలి సంఘం ఆర్మూర్ డివిజన్ కార్యదర్శి పి .మార్క్స్ అన్నారు. కానూరు 9వ స్మారక సభ ను
అరుణోదయ ఆధ్వర్యంలో 12 ఏప్రిల్ 2024న సిరికొండ మండల పరిధిలోని గడ్కోల్ గ్రామంలో అరుణోదయ ఆధ్వర్యంలో నిర్వహించారు.
మార్క్స్ మాట్లాడుతూ కల కల కోసం కాదని, ప్రజల కోసమని తమ జీవితం సాంస్కృతిక రంగానికి అంకితం చేసిన కానూరి స్ఫూర్తిని నేటి కళాకారులు కొనసాగించాలని ఆయన కోరారు. ఇందిరా గాంధీ ఎమర్జెన్సీని వ్యతిరేకిస్తూ కానూరి రాసిన కళారూపాలు ఇప్పటికీ మర్చిపోలేనివని ఆయన తెలిపారు. శ్రమ నుండి పురుడు పోసుకున్న పాట శ్రామిక వర్గ విముక్తికి ఆయుధంగా మార్చడానికి కానూరి కృషి చేశారని ఆయన అన్నారు. సామాజిక మార్పులొ కళాకారుల పాత్ర కీలకమైనదని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐకేఎంఎస్ మండల అధ్యక్షులు నిమ్మల భూమేష్, కృష్ణ, రాములు, శివరాజ్, చిన్న గంగాధర్, మండల అధ్యక్షుడు మల్కి సంజీవ్ తదితరులు పాల్గొన్నారు.