A9 న్యూస్ నిజామాబాద్ ప్రతినిధి:
పూర్తిస్థాయిలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి మద్దతు ధరలతో పాటు బోనస్ ధరను చెల్లించాలి
ఏఐకేఎంఎస్ రాష్ట్ర అధ్యక్షులు వి కోటేశ్వరరావు,సీనియర్ నాయకులు ఆకుల పాపయ్య డిమాండ్
యాసంగి( రబీ సీజన్) వరి పంట రైతు చేతికొచ్చిన ఈ సందర్భంలో ప్రభుత్వం పూర్తిస్థాయిలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి మద్దతు ధరతో పాటు రైతుకు బోనస్ ధర 500 రూపాయలు చెల్లించాలని ఏఐకేఎంఎస్ రాష్ట్ర అధ్యక్షులు వి కోటేశ్వరరావు , అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర
సీనియర్ నాయకులు ఆకుల పాపయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
బుధవారం అఖిల భారత రైతు కూలీ సంఘం ఏఐకేఎంఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిజామాబాద్ నగరంలో అర్సపల్లి లో జరిగింది.
అనంతరం రైతుల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వెళ్లి పరిశీలించడం జరిగింది అనంతరం నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వాలు రైతులకు ఇచ్చిన హామీలు అమలుపరచడం లేదని వారన్నారు .
రాష్ట్రవ్యాప్తంగా 7000 పైచిలుకు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి మద్దతు ధరకు రైతుల ధాన్యాన్ని కొంటామని హామీ ఇచ్చిన ఇప్పటివరకు ఇంకా పూర్తిస్థాయిలో కేంద్రాలను తెరవకపోవడం బాధాకరమని ఆందోళన వ్యక్తం చేశారు.
తెరిచిన వాటిలో గోన సంచులను అందించడం లేదని, కేంద్రాలలో భోజన సౌకర్యం నీడ నీటి సౌకర్యం కల్పించాలని,
నిబంధనలో ఉన్న వాటిని ఎక్కడ అమలు జరపడం లేదని కొన్న ధాన్యానికి 48 గంటలలో రైతు ఖాతాలో డబ్బులు వేయాల్సి ఉండగా నెలల తరబడి ఆలస్యం జరుగుతుందని ,
తుఖాలు వేయడంలో వారాల తరబడి ఆలస్యం జరుగుతుందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు
కాంగ్రెస్ ప్రభుత్వం మద్దతు ధరతో పాటు రైతుకు 500 రూపాయలు బోనసును చెల్లిస్తామని చెప్పినది ఎక్కడ చెల్లించడం లేదని వెంటనే ఈ సీజన్ నుండే బోనస్ ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు.
రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 15 లక్షల ఎకరాలలో పంటలు ఎండిపోయి రైతులు తీవ్ర నష్టాలు పాలయ్యారని నష్టపోయిన రైతాంగానికి ఎకరానికి 25 వేల రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని, ఇటీవల కురిసిన వర్షాలకు నష్టపోయిన రైతులకు ఎకరానికి 25 వేల రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని,
అలాగే రెండు లక్షల రూపాయల రుణమాఫీ అమలు జరిపి రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు
ఎటు చూసినా రైతు పంటలు అమ్మక సమయము లో మార్కెట్ వ్యాపారస్తులు రైతును నిలువు దోపిడి చేస్తున్నారని కనీసం ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలలో కూడా తూకంలో మోసాన్ని అరికట్టి తడి తరుగు పేరుతో మోసాన్ని గురైతున్న రైతును ఆదుకోవడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టాలని ,
అవినీతి అధికార రైస్ మిల్లర్లతో కుమ్మక్కై జరుగుతున్న దోపిడిపై చర్యలు చేపట్టి రైతులను ఆదుకోవాలని అన్నారు.
రైతు పంటలకు మద్దతు ధరతో పాటు బోనస్ ధరను చెల్లించాలని ప్రతి గ్రామపంచాయతీ పరిధిలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతు కల్లాలలో కేంద్రాలలో తెచ్చిన ధాన్యానికి రక్షణ చర్యలు తగినన్ని టార్పిండ్లు ఇవ్వాలని తూకం వేసినప్పుడు తాలూ తరుగు పేరుతో జరుగుతున్న దోపిడీని అరికట్టాలని 500 రూపాయలు బోనస్ ఇవ్వాలని రెండు లక్షల రుణమాఫీ అమలు జరిపి ఖరీఫ్ సీజన్ లో కొత్త రుణాలు ఇవ్వాలని అన్నారు.
ఈనెల 10 నుంచి 20 వరకు మండల డివిజన్ జిల్లా స్థాయిలో ఆందోళనకు పిలుపునివ్వడం జరిగింది.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మండల వెంకన్న, రాష్ట్ర ఉపాధ్యక్షులు వేల్పూర్ భూమయ్య, ముక్తి సత్యం, జే రాజు, సహయ కార్యదర్శి డేవిడ్ కుమార్, నందగిరి వెంకటేశ్వర్లు, రాష్ట్ర నాయకులు ఆకుల పాపయ్య, డి.సాయిరెడ్డి, లాల్ కుమార్ మరియు గోపాల్, సాయిలు తదితరులు పాల్గొన్నారు.