A9 న్యూస్ ఆర్మూర్ ప్రతినిధి:
నూ
ఆర్మూర్ జర్నలిస్ట్ కాలనీలోని భక్త హనుమాన్ ఆలయంలో మంగళ వారం క్రోధి నామ సంవత్సరం ఉగాది కాలనీవాసులకు మరియు మహిళా సోదరీమణులందరికీ ఉగాది పర్వదినాన్ని పునస్కరించుకొని ప్రత్యేక పూజా కార్యక్రమాలు, పంచాంగ శ్రవణం, పచ్చడి వితరణ నిర్వహించారు. ఆలయ కమిటి ఆద్వర్యంలో సాయంత్రం అర్చకులు దినేష్ శర్మ ఆలయ ప్రాంగణంలో పంచాంగ శ్రవణం చేశారు. నూతన సంవత్సరంలో రాశుల ఫలితాలు వివరించారు. ష్టానిక కౌన్సీలర్ నర్సింహరెడ్డి, హనుమాన్ ఆలయ కమిటి అద్యక్షుడు శివరాజ్ కుమార్, కాలనీ అభివృద్ది కమిటి అద్యక్షుడు గోసికొండ అశోక్, గడ్డం శంకర్, ఎల్ టి కుమార్, ఎర్ర భూమయ్య, సతీష్, గణపతి, నరహరి, సత్యనారయణ గౌడ్, కొక్కెర భూమన్న, గణపురం సంతోష్, సాయినాథ్, మురళీ, విజయ కుమార్, సాయన్న, భాజన్న తదితరులు పాల్గొన్నరు.