ఆర్మూర్ పట్టణంలోని టీఎన్జీవోస్ భవనంలో బదిలీపై వెళ్తున్న తాసిల్దార్ వేణు, నూతన తాసిల్దారుగా బాధ్యతలు స్వీకరించిన శ్రీకాంత్ లకు ఘనంగా సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆర్డిఓ వినోద్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై తాసిల్దార్లను సన్మానించారు.

తాసిల్దార్ కార్యాలయ అధికారులు, సిబ్బంది, మీసేవ సెంటర్ నిర్వాహకులు, రేషన్ డీలర్ అసోసియేషన్ సభ్యులు, వీఆర్ఏలు, బదిలీపై వెళ్తున్న తాసిల్దార్ వేణును, నూతన తాసిల్దార్ శ్రీకాంత్ లను పూలమాల శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా తాసిల్దార్ వేణు మాట్లాడుతూ తనకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించిన తాసిల్దార్ కార్యాలయ అధికారులకు, సిబ్బందికి, ఆర్మూర్ ప్రజాప్రతినిధులకు, నాయకులకు,ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం నూతన తాసిల్దార్ శ్రీకాంత్ మాట్లాడుతూ రెవెన్యూ పరంగా ఎటువంటి సమస్యలు లేకుండా ప్రజలకు త్వరగతిన పనులు అయ్యే విధంగా కృషి చేస్తానని పేర్కొన్నారు. ఆర్ డి ఓ వినోద్ కుమార్ మాట్లాడుతూ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగే విధంగా ప్రతి ఒక్క అధికారి, సిబ్బంది కృషి చేయాలని అన్నారు. తాసిల్దాఆర్ ప్రజలకు అందుబాటులో ఉంటూ రెవెన్యూ పరమైన సమస్యలు తలెత్తకుండా చూడాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో టిఎన్జీవోస్ ఆర్మూర్ తాలూకా అధ్యక్షుడు షికారి రాజు, ఆర్మూర్ డిప్యూటీ తాసిల్దార్ విజయ్, ఆర్ ఐ అశోక్ సింగ్, టీఎన్జీవోస్ తాలూకా కార్యవర్గ సభ్యులు, ఆర్మూర్ తాసిల్దార్ కార్యాలయ, సిబ్బంది, తదితరులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *