A9 న్యూస్ హైదరాబాద్ ప్రతినిధి:
తెలంగాణ రాష్ట్రానికి భారత వాతావరణశాఖ శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో 6వ తేదీ వరకు వాతావరణం పొడిగా ఉంటుందని, 7, 8 తేదీల్లో పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. కాగా, రాష్ట్రంలో నిన్న తొలిసారిగా 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.