A9 న్యూస్ నిజామాబాద్ ప్రతినిధి:
నిజామాబాద్ జిల్లాలో పార్లమెంట్ ఎన్నికల కోసం నిర్వహించిన శిక్షణకు డుమ్మా కొట్టిన ప్రభుత్వ ఉపాధ్యా యులకు డీఈవో షాక్ ఇచ్చారు. ఈ నెల 1, 2 తేదీల్లో జిల్లాలోని 5 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉపాధ్యాయులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ శిక్షణకు జిల్లాలోని 84 మంది ఉపాధ్యాయులు డుమ్మా కొట్టారు. వారికి నోటీసులు జారీ చేసి సంజాయిషీ చెప్పాలన్నారు.