A9 న్యూస్ ఆర్మూర్ ప్రతినిది:
*క్షత్రియ ఇంజనీరింగ్ లో క్యూ స్పైడర్ వారి ప్రాంగణ నియామకాలు
-క్షత్రియ కళాశాల లో ప్రత్యేకమైన విద్య పై అవగాహన పెంచడం
-ఆటపాటలతో మరియు చదువుతోపాటు విజ్ఞానం నేర్పడం
-నేటి సమాజంలో పిల్లలకు పాఠాలు చెప్పడమే కాదు అర్థమయ్యే విధంగా కూడా చెప్పాలి
ఆర్మూర్ పట్టణంలోని చేపూర్ గ్రామంలోని క్షత్రియ ఇంజనీరింగ్ కళాశాల విద్యాసంస్థల ఆధ్వర్యంలో స్థానిక క్షత్రియ ఇంజనీరింగ్ కళాశాలలో ఈరోజు క్యూ స్పైడర్ హైదరాబాద్ వారి కళాశాల ప్రాంగణ నియమాకాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో కళాశాల నాలుగవ సంవత్సరం విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు. క్యూ స్పైడర్ కంపెనీ తరఫునుంచి హెచ్ ఆర్ ప్రతినిధులు యామిని శ్రావ్య మరియు ప్రియాంక కోలార్ లు నియామక ప్రక్రియను నిర్వహించారు.
తొలి రౌండులో ఆప్టిట్యూడ్ టెస్ట్ నిర్వహించారు, రెండవ రౌండ్ గ్రూప్ డిస్కషన్, మూడవ రౌండ్ పర్సనల్ ఇంటర్వ్యూ లను నిర్వహించారు. ఈ మూడు రౌండ్లలో విద్యార్థులందరూ తమ ప్రతిభను చాటి చివరికి 22 విద్యార్థులు సెలెక్ట్ కావడం జరిగింది.ఇట్టి నియామక కార్యక్రమంలో కాలేజీ సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ అల్జాపూర్ దేవేందర్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఆర్కే పాండే వివిధ విభాగాతిపతులు పాల్గొన్నారు. కళాశాల టిపిఓ సునీల్ గటడి ఈ నియామక ప్రక్రియను సమన్వయ పరిచారు. ఇట్టి ప్రాంగణ నియామకం లో ఎంపికైనటువంటి విద్యార్థిని విద్యార్థులను కళాశాల యాజమాన్యం మరియు ప్రిన్సిపాల్ అభినందించారు.