A9 న్యూస్ ఆర్మూర్ ప్రతినిది:
ఆర్మూర్ పట్టణంలోని భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) ఆర్మూర్ 5 వ డివిజన్ మహాసభ స్ధానిక సివిఆర్ కాలేజీ లో అట్టహాసంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు రాచకొండ విఘ్నేష్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యారంగాన్ని ధ్వంసం అయ్యాయి చేస్తుందని అన్నారు. కేంద్రం తీసుక వచ్చిన నూతన జాతీయ విద్యా విధానం రద్దు చేయాలని డిమాండ్ చేశారు.అదే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్య శాఖ కి మంత్రి నీ నియమించాలని డిమాండ్ చేశారు. అదే విధంగా పెండింగ్ లో ఉన్న స్కాలర్ షిప్స్ మరియు ఫీ రీయింబర్స్మెంట్ నీ సకలం లో విడుదల చేయాలని అన్నారు. ఈ మహాసభ లో భవిష్యత్తు కర్తవ్యాలను రూపొందించామని భవిష్యత్తు లో ఉద్యమాలను నిర్వహిస్తాం అని అన్నారు. నూతన డివిజన్ కమిటీ 15 మంది తో ఎన్నిక కావడం జరిగింది. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్ష కార్యదర్శులు జవహర్ సింగ్, సిద్దల నాగరాజు, ఉపాధ్యక్షులు ముత్యం, నటేష్, కిరణ్, అర్జున్, అజయ్, రమ్య, మమత , లావణ్య,తదితర నాయకులు పాల్గొన్నారు.