A9 న్యూస్ న్యూ ఢిల్లీ ప్రతినిది:
తిహాద్ జైల్లో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవితకు అవస రమైన సౌకర్యాలు కల్పిం చాలని రౌస్ అవెన్యూ కోర్టు మరోసారి జైలు అధికారుల ను ఆదేశించింది.
కొన్ని వస్తువులను స్వయంగా సమకూర్చుకునేందుకు అవకాశం ఇచ్చింది. జపమాల, పుస్తకాలు, పెన్నులు, ఇతర వస్తువులతో పాటు మెడిటేషన్ చేసుకునేందుకు, ఇంటి నుంచి ఆహారం, పరుపు, దుప్పట్లు తెచ్చుకు నేందుకు, ఆభరణాలు ధరించేందుకు, లేసులు లేని బూట్లుకు అనుమతించా లని న్యాయస్థానం ఆదేశించింది.
మార్చి 26న ఇచ్చిన ఉత్త ర్వుల్లో ఏ ఒక్కటీ అనుమ తించలేదని కవిత తరఫు న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. కోర్టు ఉత్తర్వుల్లో పేర్కొన్న అన్నింటినీ తెచ్చుకునేందుకు అనుమతించినట్లు జైలు సూపరింటెండెంట్ న్యాయ స్థానానికి తెలిపారు.
దీనిపై స్పందించిన రౌస్ అవెన్యూ కోర్టు మరోసారి స్పష్టంగా లిఖితపూర్వక ఆదేశాలు జారీ చేసింది.