A9 న్యూస్ ఆర్మూర్ ప్రతినిధి
*ఆక్స్ఫర్డ్ పాఠశాలలో అవార్డుల ప్రధానోత్సవం*
ఆర్మూర్ పట్టణ శివారులోని గాంధీ నగర్ లో గల ఆక్స్ఫర్డ్ పాఠశాలలో సోమవారం రోజున ఘనంగా విద్యార్థుల అవార్డుల ప్రధానోత్సవం నిర్వహించారు. ఇట్టి కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా
తెలంగాణ ప్రాంత ఆక్స్ఫర్డ్ విద్యా సంస్థల సమన్వయకర్త
అయినటువంటి ఉల్లెంగ శ్రీనివాస్ రావు మాట్లాడుతూ విద్యార్థులు ఇష్టంతో చదివితే తాము అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటారని ఆయన అన్నారు. బట్టి విధానాన్ని పక్కనపెట్టి నూతన విద్యా విధానానికి అనుగుణంగా చదివితే జాతీయస్థాయిలో పోటీ పరీక్షల్లో ప్రతిభ చూపగలరని విద్యార్థులకు సూచించారు. . ఇట్టి కార్యక్రమం లో భాగంగా భాగంగా పాఠశాల కరస్పాండెంట్ మానస గణేష్ గారు మాట్లాడుతూ విద్యార్థుల సర్వతోముఖాభివృద్దికి మా యాజమాన్యం ఎల్లవేళలా కృషి చేస్తామని అన్నారు. తనంతరం పాఠశాల పరిపాలనాధికారి శ్రీ పద్మగారు మాట్లాడుతూ ఉపాధ్యాయులు చెప్పినటువంటిది తూచా తప్పకుండా పాటించి చదువుతోపాటు సంస్కారాన్ని పెంచుకొని సమాజంలో గొప్ప పేరు తెచ్చుకోవాలని ఆకాంక్షించారు.
ఈ విద్యా సంవత్సరంలో వివిధ విభాగాల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ముఖ్య అతిథి చేతుల మీదుగా అవార్డులను ప్రధానం చేయడం జరిగింది.
ఇట్టి కార్యక్రమంలో ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.