A9 న్యూస్ ప్రతినిధి:
మల్లిపుడి షర్మిల జిల్లా వెస్ట్ గోదావరి, ఊరు తాడేపల్లిగూడెం. వీరు బిఎస్పికి నియోజకవర్గ ఇంఛార్జి, జిల్లా వైస్ ప్రెసిడెంట్ గాఉన్నారు. వీరు బుద్ధిష్ట్ గా దీక్ష తీసుకున్నారు. 15 మార్చి 2015న “మన పుస్తకాలు” పేరున బుక్స్ స్టాల్ స్థాపించారు. దిని ద్వారా బహుజన మహనీయులకు సంబందించిన సామగ్రి ప్రజలకు అందిస్తుంటారు. మీటింగ్లోకి వెళ్ళి వాటిని అమ్మడం. ఆంధ్రలోని అన్ని జిల్లాల్లోకి వెళ్లి సాహిత్య భావజాల వ్యాప్తి చేస్తుంటారు. అదేగాక సమాలోచన ఉన్న వారితో కల్సి ఉద్యమంలో ఉన్నారు. జూనియర్ డిగ్రీ కాలేజీల్లో ఫూలే అంబేడ్కర్లపై అవగహన సదస్సులు నిర్వహిస్తున్నారు. రాష్ట్రమంతాట వీరు ఎకైక మహిళ బుక్ స్టాల్ సెల్లార్ గా ప్రసిద్ది చెందారు. యూనివర్సటీలో బుక్స్ ఎగ్జిబిషన్, అనేక వేళల్లో జిల్లా కలెక్టర్లు ఎక్జిబిషన్ పెట్టమని చెబుతారని ఆమె గౌరవంగా తెలియజేశారు. అయితే ఆరంభంలో జ్ఞ్యానజ్యోతి సావిత్రిమాయి ఫూలే గురించి చదవిన వెంటనే తనలో చాలా మార్పు వచ్చిందన్నారు. ముఖ్యంగా తాను బహాన్ మాయావతి లాగా పెండ్లి చేసుకోలేదని తనకు ఆమె ఆదర్శమని అన్నారు. ఈ మేరకు శనివారం ముంబైకి వచ్చి బహుజన సాహితీ, సామగ్రిలు కొనుగోలు చేశారు. ఈ సందర్బంగా సిటీలోని చైత్యభూమి, రాజగృహ, మాత రమాయి సమాధిని సందర్శించారు. వీరికి తోడుగా ముంబై తెలంగాణ బహుజన ఫోరం నేతలైన చౌవల్ రమేష్, సరిత చౌవల్, భీంరత్న మాలజీ, ఎన్. శరత్ బాబు ఉన్నారు.