A9 న్యూస్ ప్రతినిధి జితేందర్అ
భివృద్ధి పధంలో ఐ.డి.సి.ఎం.ఎస్
సంబారి మోహన్, అధ్యక్షులు.అభివృద్ధి పధంలో ఐ.డి.సి.ఎం.ఎస్* –
ఇందల్ వా యీ .సి.ఎం.ఎస్ యొక్క 55వ మహాజన సభ సమావేశం తేదీ : 30.03.2024, శనివారం రోజున మధ్యాహ్నo 12.00 గం. లకు. సొసైటీ అధ్యక్షులు శ్రీ సంబారి మోహన్ గారి అధ్యక్షత న నిర్వహించడం జరిగినది.
ఈ యొక్క సమావేశం యందు ఐ.డి.సి.ఎం.ఎస్ కు సంబంధించిన సెప్టెంబర్ 2023 నుండి ఫిబ్రవరి 2024 వరకు అయిన అర్ధ వార్షిక నివేదిక, ఏప్రిల్ 2023 నుండి ఫిభ్రవరి 2024 వరకు అయిన వ్యాపార నివేదిక మరియు 2024-25 సం. రము నకు ఆదాయ, వ్యయ అంచనా బడ్జెట్ ను సభకు చదివి వినిపించగా గౌరవ సభ్యులు తీర్మానం చేయనైనది.
ఈ సమావేశంలో నూతనంగా ఎన్నికైన ఎన్.డి.సి.సి.బి చైర్మన్ శ్రీ కుంట రమేష్ గారిని ఐ.డి.సి.ఎం.ఎస్ చైర్మన్, పాలకవర్గ సభ్యులు సన్మానించారు. అనంతరం పలు సొసైటీ చెర్మన్లు మాట్లాడుతూ, రైతులకు భీమా సౌకర్యం ఒక లక్ష నుండి రెండు లక్షలకు పెంచినందుకు నూతన ఎన్.డి.సి.సి.బి చైర్మన్ శ్రీ కుంట రమేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, వీరి యొక్క సహాయ సహకారాలు ఎల్లవేళలా ఉండాలని తెలిపినారు. అలాగే అసైన్డ్ భూములకు కూడా ఋణం ఇవ్వవలెనని. ప్రైవేట్ బ్యాంక్ లకు దీటుగా ఒక్కో ఎకరానికి యాభై వెయ్యిల చొప్పున ఋణం మంజూరు చేయాలని గౌరవ సభ్యులు కొరడమైనది. అదే విధముగా రైతు రుణమాఫీ త్వరగా చేయాలని కోరినారు. ప్రస్తుత సీజన్ యందు ఎరువుల సరఫరా, ధాన్యం కొనుగోలు లలో భాగంగా చినిగిన గోనె సంచులు రాకుండా మంచి సంచుల సరఫరా, లారీల కొరత రాకుండా చూడాలని కోరారు.
అనంతరం సంఘ అధ్యక్షులు సంబారి మోహన్ గారు మాట్లాడుతూ గౌరవ సభ్యులు తెలియజేసిన పలు అంశాలను పరిష్కరించుటకు గానూ నూతన ఎన్.డి.సి.సి.బి చైర్మన్ శ్రీ కుంట రమేష్ రెడ్డి గారి సహకారం తో జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకవెళ్తామని తెలియజేస్తూ, ప్రస్తుత మా పాలక వర్గం ఏర్పడిన నాటి నుండి పెండింగ్ లో ఉన్న చాలా సమస్యలను పరిష్కరించమని, నష్టాల్లో ఉన్న సంఘాన్ని లాభాల బాటలో తీసుకొస్తు, చాలా అభివృద్ధి చేశామని, ఇందుకు సహకరించిన ఉమ్మడి జిల్లాలోని ప్రజా ప్రతినిధులకు, అధికారులకు, సహకార సంఘాల ఛైర్మన్ లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అలాగే అతి త్వరలోనే అన్ని కొనుగోలు కేంద్రాలలో వరి ధాన్యం కొనుగోలు ప్రారంభించి రైతులకు ఎటువంటి సమస్యలు రాకుండా చూస్తామని తెలిపినారు.
ఈ కార్యక్రమంలో ఎన్.డి.సి.సి.బి చైర్మన్ శ్రీ కుంట రమేష్ రెడ్డి గారు, ఐ.డి.సి.ఎం.ఎస్ వైస్ చైర్మన్ శ్రీ వై. ఇంద్ర సేనా రెడ్డి, డైరెక్టర్ లు పి. సాయన్న గారు, బి. తార చంద్ నాయక్ గారు, ఈ. శ్రీనివాస్ గౌడ్ గారు, శ్రీ నల్లవెల్లి కపిల్ రెడ్డి గారు, ఎన్. రాజేశ్వర్ గారు శ్రీ మధునాల రాజా గౌడ్ గారు, శ్రీ బి. గోపాల్ గారు, ఎన్.డి.సి.సి.బి డైరెక్టర్ లు, ఉమ్మడి జిల్లాలోని సహకార సంఘాల ఛైర్మన్ లు, ఐ.డి.సి.ఎం.ఎస్ మేనేజర్ శ్రీ కె. నగేష్ గారు మరియు సంఘ సిబ్బంది పాల్గొన్నారు.
H.No:3-36/1
Indalwai station NH 44
main service road near union Bank
district nizamabad, Telangana India.
9440038547