A9 న్యూస్ బ్యూరో:
ఉపాధి హామీ కూలీల కనీస వేతనం పెంపు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కూలీలకు కేంద్రం శుభవార్త చెప్పింది. వారికి రోజువారీ వేతనం పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో(2023-24) కనీస వేతనం రూ.272గా అమలు చేస్తుండగా, దీనికి అదనంగా మరో రూ.28 జోడించి ఏప్రిల్ నుంచి మొదలయ్యే కొత్త ఆర్థిక సంవత్సరంలో(2024-25) రూ.300 ఇవ్వనున్నారు.