A9 న్యూస్ బాల్కొండ ప్రతినిధి మార్చ్ 28:
* సర్వే లో ప్రభుత్వం భూమి మాయం ?
నిజామాబాద్ జిల్లా బాల్కొండ లో ప్రభుత్వ భూముల సర్వే లో ఒకొక్క సంఘటనలు వెలుగు లోకి వస్తున్నాయి,జనవరి 2021 బాల్కొండ లో ప్రభుత్వానికి చెందిన భూమి ఎంత ఉందో సర్వే చెయ్యాలని మాజీ ఏం.ఎల్.ఏ మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆదేశాలతో పూర్వపు అర్.డి. ఓ.శ్రీనివాసులును పూర్వపు తఃహాశిల్దార్ అర్చన రెడ్డి కి ఆదేశాలతో సర్వేయర్ ప్రసాద్ తో పూర్వపు గ్రామాభివృద్ధి కమిటీ కార్యవర్గం పాటు “ఆంమ్ సంగం”సభ్యుల ముందర భూ సర్వేను తేది 28-01-2021 నుండి 29 -01-2021 సర్వే చేసి ప్రభుత్వ భూము లైన సర్వే నంబర్ 1327 లో ఒక ఏకరం,మరియు సర్వే నెంబర్ 1333 రైతు వేదిక వెనుక (1.1/2)ఒక ఏకరంన్నర ప్రభుత్వ భూముల ఉన్నాయని గుర్తించారు,గుర్తించిన భూమికి “ఫెన్సింగ్” చెయ్యాలని పూర్వపు పంచయత్ కార్యదర్శి నర్సయ్య కు ఆదేశాలు ఇచ్చిన ఆయన భూ కబ్జా దారులతో “అమ్యమ్యా “తో చేతులు మారి భూకబ్జా దారులు రెండు గంటల భూమి కబ్జా కు గురైంది.
* అర్.టి. ఐ ద్వారా వెలుగు లోకి
1327 మరియు1333 ప్రభుత్వానికి చెందిన భూమి భూ కబ్జా రియల్ ఎస్టేట్ వ్యాపారి కబ్జా కు పాల్పడి రెండు అంతస్తుల భవంతి నిర్మాణం జరుగుతుందని బాల్కొండ కు చెందిన సమాచార హక్కు చట్టం డివిజనల్ అధ్యక్షుడు కాజా మొయినుద్దీన్ నిజమాబాద్ అసిస్టెంట్ డైరెక్టర్ భూ సర్వే ల్యాండ్స్ కు ఫిర్యాదు చేయడంతో 07 జనవరి 2023 రోజున తహశీల్దార్ వి.వినోద్, సర్వేయర్ ప్రసాద్ కలసి అక్రమంగా నిర్మిస్తున్న భవంతులను పరిశీలించి ప్రభుత్వ భూమి కబ్జాకు గురి అయిందని సర్వేయర్ ప్రసాద్,తహశీల్దార్ వి.వినోద్ నిర్ధారించి పత్రికలకు ఈ విషయాన్ని వివరించ గ అనేక పత్రికల్లో వార్తలు కూడా వచ్చాయి.ప్రభుత్వ భూములకు ఫెన్సింగ్ చేయనందుకు భూ కబ్జా దారునికి సహకరిచడానే కారణంగా గ్రామ పంచాయతీ కార్యదర్శి నర్సయ్య,
ఉన్న ఫలంగా పైరవీచేసుకొని హసకొత్తుర్ కు బదిలీ చేసుకొని పోయారు. నేనేం తక్కువ అన్నట్లు సర్వే నంబర్ 1327 లో ఒక ఏకరం,మరియు రైతు వేదిక వెనుక (1.1/2)ఒక ఏకరంన్నర భూమిలో కొంత భాగాన్ని భూ కబ్జా దారులకు “అక్రమ పట్టా చేసిన తహ్సిల్ దార్ పై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు వెళ్లడంతో తహశీల్దార్ కూడా 2022 లోనే బాల్కొండ ఏం.యెల్.ఏ మంత్రి ఫైరవి తో బదిలీ పై వెళ్లిపోయారు.ఈలోగా భూకబ్జా దారుడు రెండు భవంతుల నిర్మాణాo చేసేశారు పూర్తి చేశారు.ఈ లోగా బాల్కొండ కు నూతన గ్రమాభి వృద్ది కమిట్ ఏర్పడిన తర్వాత మళ్లీ ఇదే అక్రమ నిర్మాణం గురించి జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు వెళ్లడంతో అదే సర్వే నంబర్ 1333 భూమిలో తేది 27-01-2023 రోజున మళ్ళీ “రీసర్వే” చేసి ప్రభుత్వ భూమి కబ్జా కాలేదని ప్రసాద్ సర్వేయర్ రిపోర్ట్ ఇచ్చారు. గతంలో అదే సర్వేయర్ ప్రసాద్,తఃహాశిల్డర్ వి.వినోద్,07 జనవరి 2023 రోజున తహశీల్దార్ ఇద్దరూ కలసి అక్రమంగా నిర్మిస్తున్న భవంతులను పరిశీలించి ప్రభుత్వ భూమి కబ్జాకు గురి అయిందని ఇద్దరు నిర్ధారించారు.ఓకే భూమి రెండు సంత్సరకాలంగా ప్రభుత్వ భూమి ఉందనీ రెండో సారి లేదని ఇందులో “లోపాయి కారి” ఒప్పందంతో ఏమిటో తెలియడం లేదు.ఇందులో ఎంత మందికి భూ కబ్జాదారులు”అమ్యమ్మ్యా” ల రూపంలో ఇచ్చుకున్నరో తెలియదు కానీ కేవలం (02) సంవచరల వ్యవధిలో ఎక్కువగా ఉన్న ప్రభుత్వ భూమిని బదిలీపై వెళ్లిన సర్వేయర్ ప్రసాద్ మింగేశాడా ? లేక “స్టువర్ట్టు పురం దొంగల ముఠా ” ఎత్తుకెళ్లారా ? లేదా ప్రకృతి వైపర్యాల వల్ల భూమి మళ్ళీ భూ గర్భంలో కుంగి పోయి కనపడ కుండా పోయిందా ? ఇందులో “ఏం మతలబు ఉందో ” అని స్థానిక ప్రజలు, పాత వి.డి.సి తో పాటు అన్ని యువజన సంఘాలు, ప్రజలు ఆచ్చర్యపోతున్నారు.. 2022 లో ఓకే ఏడాది ముగ్గురు అధికారులు బదిలీ చేసుకొని వెళ్లిపోవడం వెనుక రహస్య మేమిటి ఖిల్లా లో అగమై తిరుగుతున్న “బేతాలునికే”ఎరుక అని ప్రజలు యువజన సంఘాల వారు ఆందోళన చెందుతున్నారు.
* పూర్వపు సర్వేయర్ లను విచారించాలని రాష్ట్ర నాయకుల డిమాండ్
సర్వే నంబర్ 1333 యన్.టి.అర్.కాలనీలో 1995 నుండి ప్రభుత్వ భూముల్లో భూ కబ్జా దారులు పేదల వద్ద ఒకోక్కరి వద్ద 40 వెలు వసూలు చేసి 1995 నుండి గతంలో పని చేసిన సర్వేయర్ లైన నర్సింహ రెడ్డీ, రాజు, ప్రసాద్, లచే హద్దులు చూపించారని తెలుస్తుంది. అప్పట్లో భూ కబ్జా దారులు వసూలు చేసిన దాంట్లో నుండి పూర్వపు సర్వేయర్స్ ఒక్కో పట్టా దారుల ద్వారా రూ,5,000/- ప్రభుత్వ భూముల్లో ప్లాట్స్ చూపించి నందుకు నజరానా ముట్ట జెప్పునట్లు లబ్ధి దారులు ఆరోపిస్తున్నారు. యన్.టి.అర్.కాలనీలో భూ కబ్జా దారులు ఇచ్చిన పట్టా సర్టి ఫికేట్స్ నకిలీ వని తేలడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇది ఇలా ఉండగా 1995 నుండి 2023 వరకు బాల్కొండ లో పని చేసిన సర్వేయర్ లతో శాఖ పరమైన విచారణ చెయ్యాలని తెలంగాణ రాష్ట్ర నేషనల్ యూత్ ప్రాజెక్ట్ ,యునైటెడ్ నేషన్స్ ఆఫ్ యూత్ ఆర్గానై జేషణ్,దక్షిణ ఆసియా మైత్రి సదస్సు కార్యదర్శి నర్సింగ్ రావు డిమాండ్ చేస్తున్నారు.
*పోలీస్ ఇంటలిజెన్స్ ద్వారా విచారణ చెయ్యాలని డిమాండ్
బాల్కొండ లో ప్రభుత్వ భూముల సర్వే పై విషయాలన్ని పరిగణలోకి తీసుకొని భూ కబ్జా దారులకు అక్రమ రిజిస్ట్రేషన్ ఏ నంబర్ పై చేశారు ? భవంతులు అన్ని ప్రభుత్వ భూముల్లో చేశారా ?
రిజిస్ట్రేషన్ లు అసలా ? నకిలీ పట్టా లా ? ఏ యం.అర్. ఓ పట్టా చేశారు ? ప్రస్తుతం జరుపుతున్న డివిజనల్ సర్వేయర్ వెంకటేశ్వర్లు ప్రభుత్వ భూముల్ని వదిలేసి హద్దు రాళ్ళు పాత డంతో మతలబు ఏమిటి ? ఇది ఇలా ఉండగా ఇల్లు నిర్మించిన వారు వాటిని మార్కెట్ ధరకు రెండింతల కు అమ్ముకోవడం, ప్రభుత్వ భూముల్ని ఆక్రమించి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడంతో భూ కబ్జా దారులు ది మూడు పువ్వులు ఆరు కాయలు గా చెలామణి అవుతూ బెంజి కార్లో దర్జాగా తిరుగు తున్నారని ఈ విషయాలన్ని రాష్ట్ర ముఖ్య మంత్రి ప్రత్యేకమైన చొరవ తీసుకోని రాష్ట్ర పోలీస్ శాఖ ద్వారా రహస్య విచారణ చేసి అన్ని పట్టా దారుల పట్టా సర్టిఫికెట్స్ ఫోరెన్సిక్ ల్యాబ్ ద్వారా పరిశీలన చేస్తే గాని బోకస్ “పట్టాల” వ్యవహారం బయటికే వచ్చే అవకాశం ఉందని తెలంగాణ రాష్ట్ర నేషనల్ యూత్ ప్రాజెక్ట్ ,యునైటెడ్ నేషన్స్ ఆఫ్ యూత్ ఆర్గానై జేషణ్,దక్షిణ ఆసియా మైత్రి సదస్సు కార్యదర్శి నర్సింగ్ రావు డిమాండ్ చేస్తున్నారు.