A9 న్యూస్ ప్రతినిధి హైదరాబాద్ 

*నేడు నూతన హైకోర్టు భవన నిర్మాణానికి శంకుస్థాపన*

తెలంగాణ రాష్ట్ర నూతన హైకోర్టు భవనానికి నేడు శంకుస్థాపన జరగనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ హాజరు కానున్నారు.కొత్త హైకోర్టు నిర్మాణం కోసం హైదరాబాద్‌ రాజేంద్రనగర్‌ లో ఉన్న వ్యవసాయ, ఉద్యానవన యూనివర్సిటీ లోంచి 100 ఎకరాలను ప్రభుత్వం కేటాయించిన విషయం తెలిసిందే.ఈ భూములను కేటాయి స్తూ గతేడాది డిసెంబరు 31వ తేదీన ప్రభుత్వం జీవో విడుదల చేయడంతో నిర్మాణ పనులకు నేడు శ్రీకారం చుట్టనున్నారు. పాతబస్తీలోని ప్రస్తుత భవనంలో 104 ఏళ్లుగా హైకోర్టు కొనసాగుతోంది.ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ నిర్మించిన ప్రస్తుత భవనంలో 2009లో అగ్ని ప్రమాదం జరిగింది. అప్పటి నుంచే కొత్త భవనం నిర్మా ణం కోసం చర్చ, ప్రతిపాద నలు మొదలయ్యాయి.పెరిగిన జడ్జిలకు అను గుణంగా భవనం సరిపో కపోవడం, పార్కింగ్, తదితర సమస్యలను దృష్టిలో పెట్టుకొని కొత్త భవనం నిర్మాణానికే ప్రభుత్వం మొగ్గు చూపింది. ఈ నేపథ్యంలో ఇవాళ శంకుస్థాపన జరగనుంది.ఈ కార్యక్రమానికి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, న్యాయమూ ర్తులు, న్యాయవాదులు హాజరుకానున్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *